చైల్డ్ సెక్స్ కేసులో మాక్స్ వెల్ అరెస్ట్
బ్రిటీష్ సోషలిస్ట్ గిస్లైన్ మాక్స్ వెల్ ను నిన్న రాత్రి అమెరికాలో అరెస్టు చేశారు. ఆమె ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ కు ముగ్గురు బాలికలను (ఒకరికి 14 సంవత్సరాలు) ఎరవేసిందని.. అతడి లైంగిక కోరికలు వారితో తీర్చిందనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ గత సంవత్సరం అనేక ఇతర లైంగిక అక్రమ రవాణా ఆరోపణలపై విచారణ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్నాడు.
జెఫ్రీ ఎప్స్టీన్ చాలా సంవత్సరాలుగా చాలా మంది బాలికలు - మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అరెస్ట్అయ్యి పోలీసుల విచారణ సందర్భంగా న్యూయార్క్‌లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్‌లో ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
మాక్స్ వెల్ పై వచ్చిన అభియోగాల ప్రకారం.. చాలా మంది మహిళలను ఎప్స్టీన్ కు మసాజ్ చేయడానికంటూ మాక్స్ వెల్ నియమించింది.ఆ తరువాత వారిని బలవంతంగా ఎప్సీన్ తో శృంగారం చేయడానికి ఒత్తిడి చేసింది.ఈ కేసులో మాక్స్ వెల్ ను నిన్న రాత్రి న్యూ హాంప్‌షైర్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో ఎఫ్‌బిఐ అదుపులోకి తీసుకుంది. మైనర్లను అక్రమ లైంగిక చర్యలకు పాల్పడటానికి ప్రలోభపెట్టే కుట్రలు చేయడం.., నేర లైంగిక కార్యకలాపాలు, రవాణా కుట్రలు చేశారంటూ అభియోగాలు ఆమెపై మోపారు.
మాక్స్ వెల్ వృత్తియే అమ్మాయిలను సమకూర్చడం అని.. వర్జీనియా రాబర్ట్స్ గిఫ్రే, లండన్ టౌన్ షిప్ లో బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ఈమె ఏర్పాట్లు చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ఆండ్రూ- మాక్స్ వెల్ ఫోటోను కూడా ఆమె చూపించి సంచలనం సృష్టించింది. అయితే బ్రిటన్ ప్రిన్స్ తో లైంగిక సంబంధం పెట్టించడం పై ఇప్పటిదాకా నిర్ధారణ కాలేదు.