భారత బెట్టింగ్ కింగ్ అలా చనిపోయాడట
చిన్న ఊరు మొదలుకొని మహానగరం వరకూ కనిపించే దేశీయ మట్కాకు మూలపురుషుడు ఒకడున్నాడు. ముంబయిలో బతికే ఇతగాడి పుణ్యమే దేశంలో మట్కా ఎంట్రీ ఇవ్వటానికి కారణంగా చెబుతారు. అతగాడి దెబ్బకు దేశంలో బెట్టింగ్ జాడ్యం మొదలైందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడున్న ఎందరో మట్కా మొనగాళ్లకు గాడ్ ఫాదర్ గా చెప్పే రతన్ ఖత్రీ తాజాగా ముంబయిలో మరణించాడు.
88 ఏళ్ల వయసులో తనింట్లో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు.దేశ విభజన సమయంలో పాకిస్థాన్ లోని కరాచీ ప్రాంతానికి చెందిన ఖత్రీ.. అప్పట్లోనే పొట్ట చేతపట్టుకొని ముంబయి మహానగరానికి వచ్చాడు. ఆ తర్వాత కాలంలో మట్కాను దేశానికి పరిచయం చేయటమే కాదు.. స్వల్ప వ్యవధిలోనే తన ముద్రను వేశాడు.
దేశీయంగా మట్కా కింగ్ గా అభివర్ణించే ఆయన.. తాజాగా మరణించిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. మామూలు రోజుల్లో కానీ మరణించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఎలాంటోడు కన్నుమూసినా.. ఇరవై మందికి మించిన హాజరు కాని దుస్థితి నెలకొంది. దేశీయ మట్కా కింగ్ గా అభివర్ణించే ఖత్రీ మరణం.. ఇప్పుడు ఎవరికీ పెద్దగా తెలీకుండానే ఆయన అంత్యక్రియలు పూర్తి కానున్నాయి.