భారీగా పెరుగుతున్న విదేశీ మారకపు నిల్వలు..ఎంతలా అంటే?

Update: 2020-07-18 23:30 GMT
ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. గతంలో తరచూ విదేశీ మారకపు నిల్వలపై ఆందోళన వ్యక్తమయ్యేది. అందుకు భిన్నంగా మోడీ హయాంలో మాత్రం విదేశీ మారకపు నిల్వలు అంతకంతకూ పెరగటమే కానీ తగ్గింది లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో విదేశీ మారకపు నిల్వలు భారీగా పెరిగినట్లుగా గుర్తించారు. జులై పదో తేదీ నాటికి 310.80 కోట్ల డాలర్లు పెరిగి మొత్తంగా 51,636.20 కోట్ల డాలర్లకు చేరుకున్నట్లు గుర్తించారు.

జులై మూడో తేదీతో ముగిసిన వారంలో ఈ విదేశీ మారక నిల్వలు 51,354 కోట్ల డాలర్లుగా ఉండేవి. తొలిసారిగా జూన్ పదితో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు తొలిసారి 50వేల కోట్ల డాలర్లకు పెరిగాయి. ఇంత పెద్ద మొత్తంలో విదేశీ మారక నిల్వలు ఈ మధ్య కాలంలో పెరిగింది లేదని చెబుతున్నారు. ఫారిన్ ఎక్సైంజ్ మొత్తమే కాదు.. బంగారు నిల్వలు కూడా పెరిగినట్లుగా చెబుతున్నారు. తాజాగా దేశంలో బంగారు నిల్వలు 3472.9 కోట్లుగా చెబుతున్నారు. ఐఎంఎఫ్ వద్ద కూడా నిల్వల స్థితి 1.9 కోట్ల డాలర్లు పెరిగాయి.

నిజమే.. నిత్యం పెట్రోలు.. డీజిల్ ధరలు భారీగా పెంచేసి.. బాదేస్తున్న వేళ.. ఆ మాత్రం విదేశీ మారక నిల్వలు పెరగకుండా ఉంటాయా? గతంలో పెట్రోల్.. డీజిల్ మీద సబ్సిడీ ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు అది కాస్తా పోయి.. ప్రభుత్వానికి భారీ ఆదాయ వనరుగా మారింది. ఒకప్పుడు పెట్రో బిల్లు కోసం పెద్ద ఎత్తున విదేశీ మారకాన్ని వినియోగించాల్సి వచ్చేది. అందుకు భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ముడిచమురు ధరలు భారీగా పడిపోవటం.. దేశీయంగా ధరలు ఎక్కువగా ఉండటంతో.. ప్రభుత్వానికి మేలు చేస్తుంది. దీంతో.. దేశ విదేశీ మారకపు నిల్వలు పెరుగుతున్నాయన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News