కపిల్ తప్పు చేశాడు, తెలుసుకున్నాడు!

Update: 2015-11-10 07:09 GMT
తమ వైఖరితో వివాదాస్పదం అవుతున్న సెలబ్రిటీల జాబితాలో తాజాగా మరో సెల్రబిటీ చేరారు. కామెడీ నైట్ విత్ కపిల్ కార్యక్రమంతో దేశ వ్యాప్తంగా సుపరిచితమై.. ఇటీవల ఓ హిందీ సినిమాలో హీరో పాత్ర పోషించిన కపిల్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది.

ఒక నటిపట్ల అభ్యంతరకరంగా వ్యవహరించి విమర్శలకు గురి అవుతున్నాడు. ఇంటర్నేషనల్ మరాఠి ఫిలిం ఫెస్టివల్ అవార్డ్ 2015లో భాగంగా ఒక పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి కపిల్ శర్మ కూడా హాజరయ్యారు. తాగినట్లు కనిపించిన కపిల్ పలువురు నటీమణులతో అనుచితంగా ప్రవర్తించినట్లుగా చెబుతున్నారు. ఇక.. మరాఠీకి చెందిన నటి దీపాలిని కూడా ఇదే విధంగా ఇబ్బంది పెట్టినట్లు చెబుతున్నారు.

తనతో డ్యాన్స్ చేయాలని దీపాలిని కపిల్ కోరితే.. అతను ఎవరో తనకు తెలీదని రిజెక్ట్ చేసిందట. ఈ సందర్భంగా కొద్ది పాటి ఇబ్బందికర పరిస్థితి చోటు చేసుకుందని చెబుతున్నారు. దీనిపై నటి దీపాలి మాట్లాడుతూ.. తనతో డ్యాన్స్ చేయాలని అడిగారని.. అతని పేరు కపిల్ అని చెప్పారని.. కపిల్ అంటే తనకు తెలీదని.. తెలీని వారితో తాను డ్యాన్స్ చేయలేనని చెప్పి రిజెక్ట్ చేసినట్లుగా ఆమె పేర్కొంది.

ఈ వ్యవహారం వివాదంగా మారటంతో.. తాజాగా కపిల్ ట్విట్టర్ లో స్పందించాడు. జరిగిన దానికి చింతిస్తున్నట్లుగా పేర్కొన్న అతగాడు.. తాను కూడా మనిషినేనని.. తప్పులు చేయటం సహజమని సింఫుల్ గా తేల్చేశాడు. సెలబ్రిటీలు తాము కూడా మామూలు మనుషులమేనని ఒప్పుకోవటం కాస్తంత వింతే. ఇంతకీ తాను మామూలు మనిషినేనన్న విషయం కపిల్ కు ఇప్పుడే తెలిసిందే. ఇంతకు ముందే అవగాహన ఉందా..? ఈ విషయం మీద కూడా స్పష్టత ఇస్తే బాగుంటుంది.
Tags:    

Similar News