టపాసుల్ని బ్యాన్ చేసిన పలు రాష్ట్రాలు.. తెలుగు రాష్ట్రాల మాటేంటి?
దేశంలో మరే పండుగలకు లేని పరిమితులు.. సామాజిక స్పృహ హిందువుల పండుగల విషయంలోనే తరచు వస్తుంటుందన్న విమర్శ పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. సంక్రాంతి వేళ వేసే భోగి మంటలతో పర్యావరణానికి.. హోళీ కారణంగా చర్మ సంబంధిత వ్యాధులు.. వినాయకచవితి వేళ వాడే విగ్రహాలతో పర్యావరణానికి.. దీపావళికి శబ్ద.. వాయు కాలుష్యం పేరుతో నీతులు చెప్పే వారంతా.. మిగిలిన పండుగల విషయంలో మాట మాత్రానికైనా ఎందుకు మాట్లాడరన్న ప్రశ్న తరచూ వినిపిస్తూ ఉంటుంది.
ప్రతి ఏటా ఉండే ఈ రచ్చకు ఈసారి కరోనా తోడైంది. దీంతో.. ఈసారి దీపావళి విషయంలో పలు రాష్ట్రాలు.. టపాసులు కాల్చే అంశంపై పరిమితులు.. నిషేధాలు విధిస్తూ ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ.. కర్ణాటక.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో టపాసులు కాల్చే అంశంపై పరిమితుల్ని పెట్టేశారు. మరి.. తెలుగురాష్ట్రాల మాటేమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
కొద్ది నెలల క్రితమే దీపావళి సందర్భంగా టపాసుల షాపులు పెట్టుకునేందుకు అనుమతులకు ఏపీ సర్కారు ఓకే చెప్పటంతో.. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పోయింది. తెలంగాణలో మాత్రం ఇటీవలే.. ఈ అంశంపై ప్రభుత్వం ఓకే చెప్పినా.. టపాసుల షాపులు ఏర్పాటు చేసేందుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయకపోటం చర్చనీయాంశంగా మారింది.
ఈ నెల 14న దీపావళి నేపథ్యంలో కనీసం పది రోజుల ముందే లైసెన్సులు జారీ చేస్తుంటారు.ఈ రోజు నవంబరు ఏడో తేదీ. ఇప్పటికి వ్యాపారాల నిర్వహణకు లైసెన్సుల జారీ చేసేందుకు అవసరమైన ఉత్తర్వులు విడుదల చేయకపోవటంతో.. కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన రెండు..మూడు రోజలుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో టపాసులు కాల్చటంపై పరిమితులు విధిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణలోనూ అలాంటి నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే.. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కేసీఆర్ సర్కారు మధనపడుతున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో దీపావళిని నిషేధిస్తే.. మతపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న భావన అధికార పక్ష నేతల నోటినుంచి రావటం గమనార్హం. వైరస్ వ్యాప్తి జరిగినప్పటికి.. ప్రస్తుతం కేసుల నమోదు తక్కువగా ఉండటంతో అప్రకటిత పరిమితుల మధ్య పండుగను నిర్వహిస్తే ఎలాంటి చిక్కులు ఉండవంటున్నారు. అయితే.. ఇది చెప్పినంత ఈజీ కాదంటున్నారు. ఇదిలా ఉంటే.. దీపావళి పండుగ నిర్వహణకు సంబంధించిన ఉత్తర్వులు ఇంకా విడుదల కాకపోవటంపై పలు హిందూ సంస్థలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
కాలుష్యం పేరుతో టపాసుల్ని కాల్చటాన్ని నిషేధిస్తున్నారని.. రోజూ తినే ఆహారంలో రసాయనాలు ఉపయోగిస్తుంటే.. ప్రభుత్వం.. అధికారులు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా దీపావళి వ్యవహారం కేసీఆర్ సర్కారుకు కాస్త ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది.