కరోనాను మించిపోతున్నదట ఆ మహమ్మారి !

Update: 2021-09-01 15:30 GMT
పిల్లలు, యువకులు, వృద్ధులు అని వయసుతో సంబంధం లేకుండా చాలా మంది రక్తపోటు సమస్యతో సతమతమవుతున్నారు. ఈ సమస్యతో ఇబ్బంది పెడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కొంతమంది. ఇప్పటి వరకు రక్తపోటు 120/80 ఎంఎంహెచ్‌జీ గా ఉంటే అది సాధారమైనదిగాను అందరూ పరిగణిస్తున్నారు. అది దాటితే రక్తపోటు ఎక్కువగానే ఉన్నట్లు అందరూ భావించాల్సి వస్తున్నది. అయితే ప్రస్తుతం ఈ లెక్కల్లో మార్పులు జరిగాయి. ఇందుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు విషయాలు తెలిపింది. ప్రస్తుతం రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్న వారు అధికంగా ఉండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది.

ఇక నుంచి 140/90 లోపు ఉంటే అది జనరల్ అని డిసైడ్ చేయనున్నారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సవరించిన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. డయస్టాలిక్ (హృదయ వ్యాకోచం), సిస్టోలిక్ (హృదయ సంకోచ సమయంలో గుండె కొట్టుకునే వేగం)‌కు సంబంధించి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి. డయస్టాలిక్ పోటు 90 ఎంఎంహెచ్‌జీ, అంతకుమించి రెండు రోజులపాటు ఉంటేనే దానిని రక్తపోటుగా పరిగణించాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అలాగే ధూమపానం, మద్యం అలవాటు, ఒకే చోట అదే పనిగా కూర్చుని పనిచేయడం, రోజుకు కనీసం అరగంట అయినా వ్యాయామం చేయకపోవడం, వంశపారంపర్యంగా బీపీ వచ్చే అవకాశం ఉన్న వారికి, గుండె జబ్బులు ఉన్నవారికి, సిస్టోలిక్ పోటు గరిష్ఠంగా 130 ఎంఎంహెచ్‌జీ వరకు ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఇప్పటివరకు యావత్ ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని.. వారిలో 14 శాతం మందిలో మాత్రమే బీపీ నియంత్రణలో ఉందని స్పష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ క్రమంలోనే బీపీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. అధిక రక్తపోటు బాధితుల్లో దాదాపు 46 శాతం మందికి తమలో ఆ సమస్య ఉన్నట్లు గుర్తించలేరని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీపీని ‘సైలెంట్ కిల్లర్’ అని వైద్య నిపుణులు పిలుస్తున్నారు. తెలియకుండానే ఇది మనుషుల ప్రాణాలను తీసుకుపోవచ్చని హెచ్చరిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరు తరచూ బీపీని చెక్ చేయించుకోవడం మంచిదని, వారితో పాటు అలాగే 40 ఏళ్లు దాటిన వారు కూడా తప్పనిసరిగా బీపీని చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొవిడ్ వంటి మహమ్మారి వల్ల జనాలు భౌతికంగా, ఆర్థికంగా, మానసికంగా చాలా ఇబ్బందులెదుర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం మీద జనాల్లో కొంత మేరకైనా కాన్షియస్‌నెస్ తీసుకొచ్చిందని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇకపోతే ఎదుటివారు కూడా బాగుండాలని భావన కరోనా వల్ల క్రియేట్ అయిందని చెప్పొచ్చు. కొవిడ్ న్యూ వేరియంట్స్ వస్తున్న క్రమంలో జనం ఇంకా అప్రమత్తమై మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ పట్ల కూడా శ్రద్ధ వహిస్తున్నారు. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకునేందుకుగాను ముందుకొస్తున్నారు.




Tags:    

Similar News