విజయ్ టీవీకే టికెట్ రేటు రూ..10000.. త్వరపడండి
తమిళ సినీ రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న తలపతి విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.;
తమిళ సినీ రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న తలపతి విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అడుగులు వేగవంతం చేసింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు విజయ్ శ్రీకారం చుట్టారు.
రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికీ, అభ్యర్థుల ఎంపికలో విజయ్ అత్యంత పారదర్శకమైన మరియు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే టికెట్ ఆశించే వారి కోసం దరఖాస్తుల స్వీకరణను పార్టీ ప్రారంభించింది.
పార్టీ కార్యాలయం నుండి అప్లికేషన్ ఫారమ్‌ను కేవలం రూ. 100 చెల్లించి పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు రూ. 10,000 విలువైన డిమాండ్ డ్రాఫ్ట్‌ను జత చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల సీరియస్‌నెస్‌ను , వారి ఆర్థిక సామర్థ్యాన్ని ప్రాథమికంగా అంచనా వేయడానికే ఈ నామమాత్రపు రుసుమును నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
234 స్థానాల్లో 'ఒంటరి' పోరు
ఎలాంటి పొత్తులు లేకుండా తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ప్రధాన ద్రావిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే లకు ధీటుగా తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే భారత ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి 'విజిల్' గుర్తును కేటాయించింది. ఇది యువతలో, సామాన్య ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్తుందని విజయ్ భావిస్తున్నారు.
విజయ్ ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నారు?
తలపతి విజయ్ స్వయంగా ఏ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతారనేది ఇప్పుడు కోలీవుడ్ నుంచి హాట్ టాపిక్‌గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం చెన్నై పరిధిలోని ఈ స్థానాల్లో విజయ్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది.పార్టీ తొలి భారీ బహిరంగ సభ ఇక్కడే జరగడం విశేషం. మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.విజయ్ ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుండి పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 'వీ' అక్షరంతో మొదలయ్యే నియోజకవర్గాలపై ఆయన మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
సినిమా గ్లామర్‌తో పాటు పక్కా గ్రౌండ్ వర్క్ చేస్తున్న విజయ్, తమిళనాడు రాజకీయాల్లో 'గేమ్ ఛేంజర్' అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువత, మొదటిసారి ఓటు వేసే వారిని టీవీకే భారీగా ఆకర్షిస్తోంది.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎంజీఆర్, జయలలిత తరహాలో విజయ్ కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా? లేదా అనేది చూడాలి.