బీసీసీఐ సెలక్షన్ కమిటీపై మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు

Update: 2020-07-14 09:00 GMT
భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ పై క్రికెట్ ఆటగాడు.. బెంగాల్ రంజీ ఆటగాడు మనోజ్‌ తివారీసంచలన ఆరోపణలు చేశారు. భారత సెలక్షన్ కమిటీ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా భారత జట్టు ఎంపిక లో ప్రాంతీయతకు ప్రాధన్యత ఇస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చీఫ్‌ సెలక్టర్‌ సొంత ప్రాంతానికి చెందిన క్రికెటర్లకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శలు చేశాడు. ఈ సందర్భం గా సెలక్షన్స్ పారదర్శకంగా చేయాలని డిమాండ్ చేశాడు.

సిరీస్‌ల కోసం టీమిండియా జట్టు కు ఎంపిక చేసే సెలక్షన్‌ కమిటీ సమావేశాలను టీవీలో లైవ్ టెలికాస్ట్ చేయాలని మనోజ్ తివారీ సంచలన డిమాండ్‌ చేశాడు. ఐపీఎల్ తరహాలో ఎంపిక ఉండాలని కోరాడు. ఆటగాళ్లను ఏ పద్ధతి ప్రకారం కమిటీ ఎంపిక చేస్తుందో తెలుసుకోవడానికి ఇదొక్కటే పరిష్కారం అని పేర్కొన్నారు. సెలక్షన్‌ కమిటీ వైఫల్యం తోనే గతేడాది వరల్డ్‌ కప్‌ లో భారత్‌ పరాజయం కావడానికి కారణమని వివరించాడు. నాలుగేళ్ల సమయం దొరికినప్పటికీ జట్టులో ఫోర్త్ ప్లేస్ ను భర్తీ చేయలేకపోయిందని మనోజ్ తివారీ అసహనం వ్యక్తం చేశాడు.
Tags:    

Similar News