• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైరల్ న్యూస్ : కరోనా...

వైరల్ న్యూస్ : కరోనా భాదితులకు చికిత్స అందించిన డాక్టర్‌ ఆత్మహత్య!

By - Tupaki Desk
Update: 2020-04-29 01:30 GMT
అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ పై కరోనా వైరస్ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. మహమ్మారి కారణంగా ఇప్పటికే అక్కడ 16 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. మృతదేహాలను పూడ్చేందుకు కూడా సరిపడా స్థలం లేకపోవడంతో బ్రాంక్స్‌ వంటి ప్రాంతాల్లో శవపేటికలు ఒకదానిపై ఒకటి పేర్చి ఖననం చేసిన దృశ్యాలు అందరిని కలచి వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'తన  పనిని తాను చేయాలని భావించింది. కానీ అదే ఆమె ప్రాణాలు బలిగొంది' అంటూ ఓ మహిళా వైద్యురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు నిజమైన హీరో కాబట్టి.. ఆమె ప్రశంసలు అందుకునేందుకు అర్హురాలని ఉద్వేగానికి లోనయ్యారు. అసలేమైంది అంటే ...

న్యూయార్క్‌ లో లక్షలాది మంది ప్రాణాంతక వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా  పేషెంట్లకు సేవలు అందిస్తున్న డాక్టర్‌ లార్నా ఎం. బ్రీన్‌ చలించిపోయారు.  ఆస్పత్రిలో లేదా ఇంట్లో ఉన్నా ఎల్లప్పుడు రోగుల బాగోగుల గురించి ఆలోచించే ఆమె.. తాను చికిత్స అందించిన కరోనా పేషెంట్లు చనిపోవడం తట్టుకోలేక ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి డాక్టర్‌ ఫిలిఫ్‌ సి. బ్రీన్‌ వెల్లడించారు. మన్‌ హట్టన్‌ న్యూయార్క్‌ అలెన్‌ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగం మెడికల్‌ డైరెక్టర్‌ గా పని చేస్తున్న లార్నా  చని పోయారని తెలిపారు

తనకు ఎలాంటి మానసిక అనారోగ్యం లేదని.. ఈ విపరీత చర్యకు పాల్పడే ముందు తనతో మాట్లాడిందని... అంబులెన్సులో ఎక్కించడానికి ముందే ఎంతో మంది పేషెంట్లు మృతి చెందడం తనను వేదనకు గురిచేస్తుందని చెప్పిందని ఫిలిప్‌ తెలిపారు. పేషెంట్లకు సేవలు అందిస్తున్న సమయంలో తన కూతురికి కూడా కరోనా సోకిందని.. అయినప్పటికీ ఎంతో ధైర్యంగా మహమ్మారితో పోరాడి తిరిగి విధుల్లో చేరిందని గుర్తుచేసుకున్నారు. ఇక ఆస్పత్రి వర్గాలు లార్నా మృతికి గల కారణాలు తమకు అంతుపట్టడం లేదని న్యూయార్క్‌ టైమ్స్‌కి తెలిపారు. లార్నా ఎంతో ప్రతిభ గలవారని.. తక్కువ సమయంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారని ప్రశంసించాయి.
Tags:    
  • Manhattan ER doc Lorna Breen commits suicide 
  • Corona Virus In America 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

అల్లూరులో చేతులు కలిపిన టీడీపీ, వైసీపీ.. రెండో విడత మున్సిపోల్స్ లో ఆసక్తికర పరిణామం

2026-11-15 09:45 GMT

యూపీలో యోగి కోసం ఒవైసీ.. ఉత్తరాది రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్

2026-11-15 09:41 GMT

సామాన్యుడికి బిగ్ రిలీఫ్: బియ్యం కొత్త ధరలు ఫిక్స్.. ఒక్క రూపాయి ఎక్కువ అమ్మితే అంతే!

2026-11-15 09:37 GMT

త‌నిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబ‌ర్ అరెస్ట్!

2026-11-15 07:33 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

రాప్తాడు కేసులో బిగ్ అప్డేట్: బాలిక ఆరోగ్యం 75% రికవరీ

2026-11-15 07:31 GMT

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

Copyright @2026

Powered by Blink CMS