ఢిల్లీ అల్లర్లు.. తుపాకీ తో పోలీస్ పైకే ఎక్కి పెట్టాడు

Update: 2020-02-29 10:15 GMT
పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక, అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లు ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా ఏకంగా 42 మంది మృతి చెందడం దేశ వ్యాప్తంగా కలకలం రేగింది. ఆ సమయంలో ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిశాయి. దీంతో దేశ వ్యాప్తంగా వాతావరణం వేడెక్కింది. అయితే అల్లర్ల సమయంలో పోలీసులు, ఆ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. అయితే ఈ క్రమంలో పోలీస్ అధికారికి ఒక యువకుడు ఏకంగా తుపాకీతో ఎక్కి పెట్టాడు. ఈ విషయం ఇటీవల విడుదలైన ఫొటోలు చూస్తే వాతావరణం ఎలా ఉందో తెలుస్తోంది.

అల్లర్ల సమయంలో ఓ లాఠీ మాత్రమే పట్టుకున్న ఓ పోలీస్ అధికారి వస్తూ ఆందోళనకారులను నియంత్రించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ పోలీస్ అధికారికి ఓ యువకుడు చేతిలో గన్ పట్టుకుని ఎదురు వచ్చాడు. కాల్పులు జరిపిన ఓ యువకుడికి మధ్య జరిగిన ఘర్షణ తాలూకు వీడియో వైరలైంది. ఈ నెల 24వ తేదీన నార్త్ ఈశాన్య ఢిల్లీలో అల్లరి మూకలు చెలరేగడం తో వాటిని అదుపు చేసేందుకు పోలీస్ అధికారి దీపక్ దహియా వెళ్లాడు.

ఆ సమయంలో ఆందోళనకారుడు షారుఖ్ తన గన్ తో వచ్చి ఆ అధికారిని బెదిరించి కాల్పులు జరిపాడు. ఆ సందర్భంగా అతడు పోలీస్ అధికారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన వదిలిన బులెట్ పోలీస్ అధికారి దీపక్ ఎడమ వైపున కొద్దీ దూరం నుంచి దూసుకుపోయింది. దీంతో షారుఖ్ మళ్లీ గాల్లోకి కాల్పులు జరిపి పారిపోయాడు. ఒక సమయంలో దీపక్ కి, ఇతడికి మధ్య తోపులాట జరిగింది. దగ్గరలోని భవనం పై నుంచి ఓ వ్యక్తి తన మొబైల్ తో వీరి వైనాన్ని వీడియో తీశాడు.
Tags:    

Similar News