పరువు హత్య: కూతురిని పేమించాడని ప్రేముకుడిని చంపిన తండ్రి !
ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం అయిపోయాయి. ప్రేమించిన వారి కోసం పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే, మరోవైపు పరువు హత్యలు కూడా ఆగడం లేదు. ఇప్పటికీ కూడా కొంతమంది పరువు, ప్రతిష్ట అంటూ నిండు ప్రాణాల్ని బలితీసుకుంటున్నారు. క్షణికావేశంలో చేసిన ఓ చిన్న తప్పు వల్ల రెండు కుటుంబాలు జీవితాంతం బాధపడాలి. అయినా కూడా పరువు హత్యకి పాల్పడుతుండటం గమనార్హం. తాజాగా తమిళనాడులోని చిదంబరంలో జరిగిన పరువు హత్య స్థానికంగా కలకలం రేపింది.
చిదంబరంలో ఓ కిరాణా షాపు నడుపుకునే అంబళగన్ అనే యువకుడు, అదే గల్లీలో ఉన్న శ్వేత అనే అమ్మాయిని ప్రేమించాడు. శ్వేతకి , అంబళగన్ అంటే చాలాఇష్టం. ఇద్దరూ దాదాపు ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. అయితే లాక్ డౌన్ తో ప్రేయసిని చూడడం కుదరలేదు. దీనితో 3 రోజుల కిందట శ్వేత ఉన్న వీధిలోకి వెళ్లాడు. కానీ ఆమె తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అలాగే వాళ్ల చేతిలో దెబ్బలు కూడా తిన్నాడు. అయితే ఈసారి శ్వేత ఇంట్లో ఎవరూ లేరన్న సమాచారంతో ఆమె ఇంట్లోకి వెళ్ళాడు.
అయితే , అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇంట్లో శ్వేతతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరుడు కూడా ఉన్నారు. ఇంట్లోకి వచ్చిన అంబళగన్ ను చూసి వాళ్లు తట్టుకో లేకపోయారు. వీధిలో తమ పరువు పోతుందని భావించి, అక్కడికక్కడే అతడ్ని నరికి చంపేశారు. తమ పరువును మంటగలిపేలా ప్రవర్తించాడనే కోపంతోనే అంబళగన్ ను చంపేసినట్టు లేఖ రాసి శ్వేతతో పాటు ఆ కుటుంబం మొత్తం పరారైంది. స్థానికుల సమాచారం తో రంగంలోకి దిగిన పోలీసులు లేఖను స్వాధీనం చేసుకున్నారు. శ్వేతతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరుడి పై కేసులు నమోదు చేశారు.