ప్రేమించాడని మూత్రం తాగించారు ..ఎక్కడంటే ?

Update: 2020-06-17 17:30 GMT
ప్రపంచం అభివృద్ధి అంటూ రాకెట్ వేగంతో పరుగెత్తుతూ ఉంటే, ఇంకా కొన్ని చోట్ల అమానుషమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత యువత ప్రేమలో పడటం ..ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలా కామన్. కానీ,  ప్రేమించిన పాపానికి ఓ  యువ‌కుడిని చిత‌క‌బాదారు. బ‌ల‌వంతంగా మూత్రం తాగిస్తూ నీచానికి దిగారు. ఈ అమానుష ఘ‌ట‌న రాజ‌స్థాన్‌ లో జూన్ 11న చోటు చేసుకో గా ఆల‌స్యం గా వెలుగు లోకి వచ్చింది.

శిరోహి జిల్లాకు చెందిన ఓ యువకుడు.. తన మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరివి ఒకే కులాలు. అయినప్పటికీ వీరి ప్రేమను కుల పెద్దలు తిరస్కరించారు. అంతేకాదు.. ఆ యువకుడిని దారుణం గా కొట్టారు. రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. షూలో మంచి నీరు పోసి తాగించారు. ఆ తర్వాత ఓ సీసాలో మూత్రం తీసుకువచ్చి బలవంతం గా తాగించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Tags:    

Similar News