హెచ్‌ సీఏ లీగ్స్‌ లో మ‌ల్లు స‌హేంద్ర మెరుపులు

Update: 2019-07-16 10:45 GMT
హెచ్‌ సీఏ లీగ్ రెండు రోజుల క్రికెట్‌ మ్యాచ్‌ లో యువ ఆటగాడు మ‌ల్లు స‌హేంద్ర విక్ర‌మాదిత్య సత్తా చాటాడు. బ్యాటింగ్‌ లో కీలక ఇన్నింగ్స్‌ తో జట్టును కష్టాల నుంచి గట్టెక్కించిన అతను.. బౌలింగ్‌ లో సంచలన ప్రదర్శన చేశాడు. దీంతో నేషనల్స్ జట్టు 84 పరుగుల తేడాతో ఖమ్మం టీంపై ఘనవిజయం సాధించింది. మొద‌ట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నేషనల్స్ 69 ఓవర్లలో 239 ప‌రుగులు చేసింది.

ఓపెనర్ శ్రీవెన్ డకౌటవడంతో ఇన్నింగ్స్ ఆరంభంలోనే స‌హేంద్ర బ్యాటింగ్‌ కు వచ్చాడు. ఎంతో సహనంతో బ్యాటింగ్ చేస్తూ 149 క్రీజులో పాతుకు పోయిన అతను.. 140 బంతులు ఎదుర్కొని.. 6 ఫోర్ల సాయంతో 49 ప‌రుగులు చేశాడు. అనంతరం ఖమ్మం ముందు స్వల్ప లక్ష్యమే నిలిచినా.. స‌హేంద్ర నిప్పులు చెరిగే బౌలింగ్‌ ను కాచుకోలేక విలవిలలాడింది. అతను ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి ఖమ్మం నడ్డి విరిచాడు. ఆ జట్టు 155 పరుగులకే ఆలౌటైపోయింది. ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన మల్లు సహేంద్రకే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. హెచ్‌సీఏ లీగ్స్‌లో నిలకడగా రాణిస్తున్న సహేంద్ర.. భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతాడని కోచ్‌ లు అంటున్నారు.

తండ్రి మల్లు భట్టి విక్రమార్క రాజకీయాల్లో రాణిస్తూ అందరి మన్ననలు పొందారు. ఇపుడు కొడుకు క్రీడారంగంలో తన సత్తా చూపుతున్నారు. విక్రమాదిత్య క్రీడాప్రగతి చూసి తండ్రి మురిసిపోతున్నారు. సాధారణంగా రాజకీయ నేతల కొడుకులు డీల్స్ రాజకీయేతర విషయంలో ఇలా నైపుణ్యం సంపాదించడం అరుదే.
   

Tags:    

Similar News