వైసీపీలో కండువాల పండుగ ఎపుడు ?

వైసీపీలో చేరేందుకు చాలా మంది నేతలు ఆసక్తిని చూపిస్తున్నారు అని ఆ మధ్య కాలం అంతా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.

Update: 2026-06-06 01:30 GMT

వైసీపీలో చేరేందుకు చాలా మంది నేతలు ఆసక్తిని చూపిస్తున్నారు అని ఆ మధ్య కాలం అంతా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇంకేముందు వారూ వీరూ తేడా లేకుండా అంతా వచ్చి చేరుతారు అని కూడా చెప్పుకొచ్చారు. రాయలసీమ నుంచి కొన్ని పెద్ద తలకాయలు కూడా వైసీపీ కండువాలు కప్పుకుంటాయని కూడా ఒక సమయంలో హైప్ క్రియేట్ అయింది. అలాగే గోదావరి జిల్లాల నుంచి సీనియర్ మోస్ట్ నేతలు కొందరు వైసీపీ బాటన పట్టనున్నారు అని కూడా గాసిప్స్ రూపంలోనే చాలా వినిపించాయి. కానీ ఇపుడు చూస్తే కండువాలు రెడీ కానీ ఏమైంది అన్నది పార్టీలోనూ రాజకీయ వర్గాలలోనూ చర్చగా సాగుతోంది.

కట్ చేస్తే అలా :

ఇక వైసీపీలో చేరేందుకు చాలా మంది ఆసక్తితో ఉన్నారా అంటే వేచి చూసే ధోరణిలోనే నేతలు ఉన్నారని అంటున్నారు. దానికి కారణం వైసీపీ అధినాయకత్వం తీరుని బట్టే అంటున్నారు. ఒక సమయంలో వైసీపీలో చేరాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు బిగ్ షాట్స్ నిర్ణయించుకున్నారని కూడా చెబుతున్నారు. అలాగే అసంతృప్తిగా ఉన్న కొన్ని వర్గాల నేతలు కూడా ఫ్యాన్ నీడకు రావాలని తలచారు అని కూడా అంటున్నారు. కానీ వైసీపీ అధినాయకత్వం తీరు చూస్తే ఏమాత్రం మారకపోవడం వల్లనే వారంతా వేచి చూస్తున్నారు అని అంటున్నారు.

కీలక అంశాలలోనూ :

వైసీపీ అధినాయకత్వం కీలక అంశాలలోనూ సరైన ఆలోచన కానీ నిర్ణయం కానీ తీసుకోలేకపోవడం పట్ల కూడా అనేక మంది నేతలు గమనిస్తున్నారు అని అంటున్నారు. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ వైఖరి ఈ రోజుకీ మారకపోవడం పట్ల కూడా రాజకీయంగా చర్చ సాగుతోంది. అమరావతికి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్ లో పెట్టిన రోజున మావిగన్ అంటూ వైసీపీ కొత్త నిర్ణయం తీసుకోవడం కూడా బూమరాంగ్ అయింది అని అంటున్నారు. ఒక పార్టీగా తప్పులను సరిదిద్దుకునే ఆలోచన వైసీపీకి లేదని ఈ విధంగా తెలుస్తోంది అని అంటున్నారు.

సమీక్షించుకోలేక :

రాజకీయ పార్టీలు అన్నాక తప్పులు చేస్తాయి. కానీ వాటిని సమీక్షించుకుని అందరి ఆలోచనలను తెలుసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. వైసీపీలో చూస్తే అలాంటి పోకడలు ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు. తాను చెప్పిందే వేదం అన్నట్లుగా వైసీపీ వైఖరి ఉందని అంటున్నారు. అంతే కాకుండా తమను ఓడించి జనాలు తప్పు చేశారని కూటమికి యాంటీ ఇంకెంబెన్సీ ఉందని అదే తమను గెలిపించి తీరుతుందని ఒక భ్రమలో పార్టీ పెద్దలు ఉంటున్నారని అంటున్నారు.

చేరితే లాభం :

ఇక చాలా మంది నేతలు ఏ పార్టీ అయినా సొంతగా అభిప్రాయాలతో ఉంటారు. తమ భావాలను వ్యక్తం చేయాలని అనుకుంటారు. వైసీపీలో చేరితే తమ మాట నెగ్గుతుందా లేదా అన్న డౌట్ తో కూడా కొంత మంది ఉండిపోతున్నారని అంటున్నారు. అలాగే టికెట్ విషయంలో హామీ ఇచ్చినా చివరి నిముషంలో మార్పులు చేర్పులతో ఏమైనా జరిగితే ఎలా అన్నది కూడా కొందరిలో ఉందిట. ఇవన్నీ కలసి వైసీపీకి దూరంగా బయటనే నేతలు ఉండిపోతున్నారు అని అంటున్నారు. అలా కాంగ్రెస్ లో ఉన్న వారు వైసీపీ మాజీలు కూటమిలో చేరి కూడా ఇబ్బంది పడుతున్న వారు కూటమిలో కొంత అసంతృప్తిగా ఉన్న వారు వైసీపీ వైపు చూడాలనుకున్నా ఆ పార్టీ విధానాలు పోకడలలో మార్పు లేకపోవడం వల్లనే ఆగిపోతున్నారు అని అంటున్నారు. మరి వైసీపీలో కండువాల పండుగ ఎపుడు అంటే వేచి చూడాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News