స‌వాళ్ల ముచ్చ‌ట‌: బీఆర్ ఎస్‌కు రేవంత్‌-రేవంత్‌కు అర్వింద్‌!

ఇదే స‌మ‌యంలో కేటీఆర్‌పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. కొందరు మీడియా ముందు ఏవో క‌బుర్లు చెబు తుంటార‌ని.. చ‌ర్చ‌కు ర‌మ్మంటే పారిపోతార‌ని వ్యాఖ్యానించారు.

Update: 2026-06-06 03:32 GMT

తెలంగాణ పాలిటిక్స్ నిరంత‌రం హాట్‌హాట్‌గానే సాగుతున్నాయి. అధికార-ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కుల మ‌ధ్య స‌వాళ్ల రాజ‌కీయం తెర‌మీద‌కి వ‌చ్చింది. బీఆర్ ఎస్ పార్టీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి భారీ స‌వాల్ రువ్వ‌గా.. ముఖ్య‌మంత్రిరేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీజేపీ నేత‌, నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ కూడా స‌వాల్ చేశారు. దీంతో శుక్ర‌వారం రాష్ట్రంలో స‌వాళ్ల రాజ‌కీయాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

రేవంత్ ఏమ‌న్నారంటే..

బీఆర్ ఎస్ పాల‌న పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన సీఎం రేవంత్‌.. కేసీఆర్ పాల‌న‌లో రాష్ట్రం అప్పుల పాలైంద న్నారు. ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిచేయ‌కుండానే.. కేసీఆర్‌.. ప్ర‌జ‌ల సొమ్మును దోచుకున్నార‌ని వ్యాఖ్యా నించారు. పాల‌న విష‌యంలో బీఆర్ ఎస్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని దుయ్య‌బట్టారు. ఈ క్ర‌మంలోనే బీఆర్ ఎస్ పాల‌న‌కు, త‌మ 30 నెల‌ల పాల‌న‌కు పోలిక పెట్టారు. ద‌మ్ముంటే.. కేసీఆర్ ఐదేళ్ల పాల‌న‌కు, త‌మ 30 నెల‌ల పాల‌న‌కు చ‌ర్చ పెడ‌తామ‌ని రావాల‌ని స‌వాల్ రువ్వారు.

ఇదే స‌మ‌యంలో కేటీఆర్‌పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. కొందరు మీడియా ముందు ఏవో క‌బుర్లు చెబు తుంటార‌ని.. చ‌ర్చ‌కు ర‌మ్మంటే పారిపోతార‌ని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికైనా ద‌మ్ముంటే.. బీఆర్ ఎస్ నాయకులు ప‌దేళ్లు కాదు.. త‌మ ఐదేళ్ల పాల‌న‌పై చ‌ర్చ‌కు రావాల‌ని అన్నారు. త‌మ 30 నెల‌ల పాల‌న‌లో అన్ని రంగాల‌పైనా చ‌ర్చ పెడ‌తామ‌న్నారు. సాగు నుంచి ప్రాజెక్టుల వ‌ర‌కు.. ఎన్నిక‌ల హామీల నుంచి గ్యారెంటీల వ‌ర‌కు అన్నింటిపైనా చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మేన‌న్నారు.

అర్వింద్ రివ‌ర్స్‌!

ఇక‌, నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ నేరుగా సీఎంను టార్గెట్ చేయ‌డం గ‌మ‌నార్హం. పాల‌న చేత‌కాక పోతే.. రాజీనామా చేయాల‌ని ఆయ‌న స‌వాల్ రువ్వారు. ధాన్యం కొనుగోలు విష‌యంలో రేవంత్ రెడ్డి నాట కాలు ఆడుతున్నార‌ని విమ‌ర్శించారు. కేంద్రంపైనే త‌ప్పులు నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు. బీజేపీ నేత‌ల ఇళ్ల ముందు ధాన్యం పోస్తామ‌ని సీఎం వ్యాఖ్యానించ‌డాన్ని ఎంపీ త‌ప్పుబ‌ట్టారు. ముఖ్య‌మం త్రిగా ఉన్న నాయ‌కుడు.. రైతుల సమ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని.. చేత‌కాక‌పోతే ఆ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని అర్వింద్ స‌వాల్ రువ్వారు.

Tags:    

Similar News