సీఎం పక్కలో ఉంటూ పుదుచ్చేరి ప్రభుత్వాన్ని కూల్చిన మల్లాడి?

Update: 2021-02-22 12:30 GMT
పుదుచ్చేరిలో పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ఐదేళ్లపాటు పదవీకాలం ఉన్నా కూడా ప్రతిపక్షాల దెబ్బకు అర్ధాంతరంగా వైదొలిగింది. కర్ణాటక, మధ్యప్రదేశ్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది.

తాజాగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని ప్రతిపక్షాలకు కోల్పోయింది. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోలేకపోయింది. వరుస ఎమ్మెల్యేల రాజీనామాలతో మైనారిటీలో పడిన ప్రభుత్వం చివరకు పతనమైంది.

కాంగ్రెస్ ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి తన పదవికి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. మిత్రపక్షం డీఎంకే సహా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాల బాట పట్టడంతో ప్రభుత్వం మైనారిీలో పడింది.

ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి సీఎం నారాయణ స్వామి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. బలపరీక్ష నిర్వహించడానికి ఒక్కరోజు ముందు మరో ఇద్దరు వైదొలగడంతో ఇక 12 స్థానాలకే పరిమితమైంది. అర్థాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది.

ప్రతిపక్ష కాంగ్రెస్-ఏఐడీఎంకే కూటమికి 11 మంది సభ్యుల బలం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నామినేట్ చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రతిపక్షానికే మద్దతు తెలిపారు. దీంతో ప్రతిపక్షాల సంఖ్యాబలం 14కు చేరింది. 26 మంది సభ్యులున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 13 మంది సభ్యుల బలం అవసరం అవుతుంది.  ఆ మేజిక్ ఫిగర్ ను ప్రతిపక్షాలు అందుకున్నాయి. పుదుచ్చేరిలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
Tags:    

Similar News