ధోని ఖాతాలోని అరుదైన రికార్డ్ ఇదే

Update: 2020-08-16 05:00 GMT
క్రికెట్ చరిత్రలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఏకైక కెప్టెన్ గా మన మహేంద్రసింగ్ ధోని చరిత్రలో నిలిచిపోయారు.  ఆయన వల్లే 2007లో ఐసీసీ టీ-20 వరల్డ్ కప్, 2011లో ఐసీసీ వరల్డ్ కప్, 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కెప్టెన్ ధోని ఆధ్వర్యంలోని జట్లు గెలుచుకున్నాయి.

టెస్ట్ క్రికెట్ లో ధోని తొందరగానే రిటైర్ అయ్యాడు. 2014లోనే ధోని టెస్టుల నుంచి వైదొలిగాడు. 90 టెస్టుల్లో 38కి పైగా సగటుతో  4876 పరుగులు చేసిన ధోని.. టెస్టుల్లో 256 క్యాచ్ లు.. 38 స్టంప్ లు.. 6 సెంచరీలు.. 33 అర్థసెంచరీలు చేశాడు.

భారత్ తరుఫున 350 వన్డేలు ఆడిన ధోని.. 50 కంటే ఎక్కువ సగటుతో 10773 పరుగులు చేశాడు. వన్డేల్లో 10 సెంచరీలు, 73 అర్థ సెంచరీలు చేశాడు. వికెట్ కీపర్ గా 321 క్యాచ్ లు తీసుకొని 123 స్టంపులు చేశాడు.

ఇక టీ20 క్రికెట్ లో భారత్ తరుఫఉన 98 మ్యాచ్ లు ఆడిన ధోని 37పైగా సగటుతో 1617 పరుగులు చేశాడు.
Tags:    

Similar News