దేశ నిరసనల్ని మలుపు తిప్పిన మహారాష్ట్ర రైతులు
ఇదో అపూర్వమైన ఘటన. దేశంలో నిత్యం బోలెడన్ని నిరసనలు జరుగుతుంటాయి. కాలర్ చొక్కా నలగకుండా చేసే నిరసన దగ్గర నుంచి ఒళ్లంతా కుళ్లపొడుస్తున్నా లెక్క చేయకుండా తమ నిరసన వ్యక్తం చేసే వారు కనిపిస్తారు. దేశ నిరసనల చరిత్రకు సరికొత్త పాఠాలు నేర్పు మహా నిరసన ఒకటి దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటు చేసుకుంది. కలలో కూడా ఊహించలేని ఈ నిరసన ఇప్పుడు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.
శాంతి నిరసనతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. వారి సమస్యలపట్ల దేశంలో సరికొత్త చర్చ మొదలైంది. మహారాష్ట్రకు చెందిన రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని తీర్చాలన్న డిమాండ్ తో ముంబయి మహానగరానికి బయలుదేశారు. ఇందుకోసం ప్రత్యేక రైలులోనో.. ప్రైవేటు వాహనాలతో కాకుండా కాలి నడకతో వారు ముంబయి చేరుకున్నారు.
ఇలా చేరుకున్న వారు వందో.. వెయ్యో కాదు.. ఏకంగా 35 వేల మంది. ఐదు రోజుల పాటు నడిచి ముంబయి చేరుకున్న వారి కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో పంట రుణాల మాఫీ ప్రధాన డిమాండ్ గా.. గిట్టుబాటు ధర కల్పించాలని.. పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని.. ఎరువులు పరుగు మందులకు సబ్సిడీ ఇప్పించాలని కోరుతూ వేలాది రైతులు మహారాష్ట్ర అసెంబ్లీని ముట్టడించేందుకు ముంబయికి చేరుకున్నారు.
35 వేలకు పైగా రైతులు ఐదు రోజుల పాటు నడిచి మరీ ముంబయికి చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. రైతుల ఆందోళనలతో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్న సందేహంతో నగరం మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు అసెంబ్లీ వైపుకు దారి చేసే అన్ని ట్రాఫిక్ మార్గాన్ని నిలిపివేశారు. ఇదిలా ఉంటే.. రైతుల నిరసనలపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వారి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేదో మహానిరనస స్టార్ట్ కాక ముందే నిర్ణయం తీసుకుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా.