ఎమ్మెల్యే రేవ్ పార్టీల రచ్చ..మధ్యలో మోడీ ఎంట్రీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై షోలాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణీతి షిండే వివాదాస్పద - సంచలన విమర్శలు చేశారు. ప్రధానిని ఓ డెంగీ దోమతో పోల్చారు. అంతేకాకుండా ఆ దోమను అంతం చేయాలని వ్యాఖ్యానించారు. దేశానికి ఓ కొత్త దోమ సోకిందని - ఆ దోమ పేరు మోడీ బాబా అని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఆ దోమ వల్లే ప్రజలంతా జబ్బుల పాలవుతున్నారని - అలాంటి దోమను ఓటు అనే క్రిమి సంహారక మందుతో పిచికారీ చేసి సాగనంపాలని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే స్థానిక బీజేపీ ఎంపీ శరద్ బన్సోడే ను తాగుబోతు అంటూ విమర్శించింది.
మహిళా ఎమ్మెల్యే ఈ రీతిలో స్పందించిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బన్సోడే కూడా అదే స్థాయిలో రియాక్టయ్యారు. ప్రణీతి గురించి తాను నోరు విప్పితే ఆమె షోలాపూర్ లో తిరిగేందుకు ముఖం చెల్లదని - ముంబైలో ఆమె ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ రేవ్ పార్టీలకు వెళ్తుందో తనకు బాగా తెలుసని, ఆ విషయాలు చెబితే ఆమెకే ఇబ్బంది అంటూ విరుచుకుపడ్డారు. మొత్తానికి మహారాష్ట్రలో కాంగ్రెస్-బీజేపీ మధ్య ఎన్నికల విమర్శలు శృతిమించిన వ్యక్తిగత స్థాయికి చేరాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.