• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మధుప్రియ.. నేడేం...

మధుప్రియ.. నేడేం చెబుతుందో తెలుసా?

By - Tupaki Desk
Update: 2016-03-16 04:06 GMT
గాయని మధుప్రియ వ్యవహారం మరో మలుపు తిరిగింది. వయసుకు మించిన మాటలు చెబుతూ.. చిన్నవయసులోనే ప్రేమించేశానని చెప్పి.. నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవటం ఒక సంచలనం అయితే.. పెళ్లి చేసుకొని నాలుగైదు నెలలు కూడా గడవక ముందే.. తాను భారీగా మోసపోయినట్లుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసేయటం మరో ఎత్తు.

తన భర్త తనను శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నారని మీడియాకు చెప్పేయటం.. అయ్యో అంత కష్టం వచ్చిందా? అని ఆసక్తిగా అడిగిన మీడియాకు.. అప్పుడు పరిస్థితికి తగ్గట్లు స్టేట్ మెంట్లు ఇచ్చేసిన మధుప్రియ.. ఆశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ఓ భారీ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశారు. ప్రేమించటం తప్పు కాదు కానీ.. పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం పెద్దల్ని ఒప్పించి మాత్రమే చేసుకోండని చెప్పుకొచ్చారు.

పిచ్చి మీడియా.. మధుప్రియ మాట్లాడుతుంటే.. వెనుకా ముందు చూసుకోకుండా ఆమెకు వత్తాసు పలికేసింది. ఒక సెలబ్రిటీకి వచ్చి పడ్డ కష్టం తనది గా ఫీలై.. నాటకీయంగా మధుప్రియ చెబుతున్న మాటలకు మరింత మసాలా చేరుస్తూ.. ఈ ఇష్యూను అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. వేధింపులు.. దరిద్రగొట్టు ప్రేమ అంటూ వ్యాఖ్యలు చేసిన మధుప్రియ.. నాలుగు రోజులు గడిచేసరికి.. తిట్టిపోసిన భర్తతో కలిసి తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చేశారు.

ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవటం.. కొట్టుకోవటం వరకూ వెళ్లిన ఈ వ్యవహారం కాస్తా ఒక కొలిక్కి వచ్చేసింది. పోలీసుల కౌన్సిలింగ్ తో తనకు కమ్మిన మైకం తప్పిందని.. తాను తన భర్తతో ఉండాలా వద్దా అన్న విషయాల్ని మరికొద్ది రోజుల్లో ఆలోచించుకొని చెబుతానని.. అప్పటివరకూ తన తల్లిదండ్రుల వద్దే ఉంటానని చెప్పిన మధుప్రియ.. రెండు రోజులు గడిచేసరికి భర్త దగ్గరకు వచ్చేయటమే కాదు.. ఇద్దరూ కలిసి ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చేసిన పరిస్థితి. మొన్నటి వరకూ బజార్లో కొట్లాటకు దిగిన వారిద్దరూ చెప్పిన మాటల్లోని కీలకాంశాలు చూస్తే..

= తనకు.. తన భర్తకు మధ్య జరిగిన గొడవంతా తమను విడదీయటానికి జరిగిన కుట్రగా గాయని మధుప్రియ అభివర్ణిస్తే.. అవునంటూ వంత పాడారు ఆమె భర్త శ్రీకాంత్.

= నాకిలా జరిగిందని మధుప్రియ చెప్పిన వెంటనే.. మీడియా మొదలు సోషల్ మీడియా వరకూ ఎవరికి వారు.. వారికి ఇష్టం వచ్చినట్లు రాసేసుకున్నారు. మధుప్రియ అప్పుడు పేరెంట్స్ ను మోసం చేస్తే.. ఇప్పుడు భర్తను మోసం చేసిందని పోస్ట్ చేస్తున్నారు.  ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధ కలుగుతుందని శ్రీకాంత్ అంటే.. తనంటే నాకు చాలా ప్రేమ.. అతనంటే ఎంత ప్రేమంటే.. అతని కోసం చెప్పులు వేసుకోకుండా వచ్చేశానని మధుప్రియ చెబుతోంది.

= మధుప్రియ తన పేరెంట్స్ ను ఇటీవల కాలంలో కలిసి వస్తోంది. పుట్టి పెరిగిన వారి మధ్య నుంచి వచ్చిన తర్వాత వారిని చూడాలనుకోవటం తప్పు కాదు కదా. తను బాధ పడకూడదని నేనే తీసుకెళ్లి తీసుకొస్తూ ఉండేవాడిని. వాళ్ల ఇంటికి వెళితే నేను మాత్రం బయటే ఉండేవాడ్ని అని శ్రీకాంత్ చెబితే.. ఇంట్లో వాళ్లతో మాట్లాడే సమయంలో ఏదో చిన్న గొడవ అని చెబితే.. దానికి సర్దుబాటు చేయాల్సింది పోయి పోలీస్ స్టేషన్ కు వెళతామని.. ఏదేదో చెప్పారు. చివరకు కేసు పెట్టించారు. వారు మాట్లాడమన్నట్లే చెప్పాను. నా బుర్రపని చేయటం మానేసింది. ఏం మాట్లాడుతున్నానో అర్థం కానట్లుగా మారిపోయిందని మధుప్రియ చెప్పారు.

=పోలీసుల కౌన్సిలింగ్ తర్వాత శ్రీకాంత్ తో వెళ్లిపోతానంటే.. ఇప్పుడు నువ్వు కాని వెళ్లిపోతే నీకే సమస్య.. ఇంత జరిగాక మేం చచ్చిపోవాల్సిందేనని బెదిరించారని మధుప్రియ చెబితే.. తను అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తుంది..  అందుకే అలా చెప్పిందంటూ భార్యకు వంత పాడారు శ్రీకాంత్.

= నేనంటే వాళ్లకు ఇష్టం లేదు. అందుకే మధుప్రియతో నన్ను విడదీయాలని ఆమె తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అందుకే నా నుంచి ఆమెను డైవర్ట్ చేసి.. నన్ను ఏదైనా చేయొచ్చని వారు అనుకున్నారు. కౌన్సిలింగ్ తర్వాత నేను మధుప్రియ ఇంటికి వెళ్లి.. బండి దిగగానే.. వాళ్ల అమ్మ పై నుంచి కర్రలు పడేస్తే.. కిందనున్న వారు నన్ను కొట్టటం షురూ చేశారు. నన్నుచూసిన మధుప్రియ పరిగెత్తుకు వస్తే.. ఆమెను ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆ రోజు ఎవరో పిల్లాడు వస్తే.. అతన్ని చితకబాదారు. నిజానికి నన్ను మర్డర్ చేయటానికి ప్రయత్నించారని చెప్పుకొచ్చారు శ్రీకాంత్.

= పెళ్లికి ముందు ఆమె ఎలా ఉండేదో అలానే ఉంటోంది. తనకు తాను ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉంటుంది. నాకు నేను సేల్స్ ఫీల్డ్ లో ఉన్నాను. మాకొచ్చే సంపాదన మాకు సరిపోతుంది. ఎనిమిది వేలు ఇంటి అద్దె.. మరో ఎనిమిదివేలు ఖర్చులు.. అంతకంటే అదనంగా ఇంకేం ఉంటాయి? ఇకపై.. నా భార్యను నేను వాళ్ల ఇంటికి పంపకూడదని అర్థమైంది. పెళ్లి అయిన కొద్ది కాలంలో తను లేకుండా ఉన్న మూడు రోజులు పిచ్చెక్కి పోయింది. జీవితంతం తనతోనే కలిసి బతుకుతా. మమ్మల్ని ఎవరూ విడదీయలేరని శ్రీకాంత్ చెబితే.. తన జీవితం మొత్తం శ్రీకాంతోనే ఉంటానని.. ఇకపై ఎలాంటి సమస్యలు రానివ్వనని మధుప్రియ నమ్మకంగా చెబుతోంది. మొత్తంగా తమ ప్రేమకథ మరోసారి రచ్చకు రాదంటూ ఈ జంట భరోసా ఇస్తోంది. ఇద్దరూ చక్కగా ఉంటే అంతకు మించి కావాల్సిందేముంది?
Tags:    
  • Madhu Priya 
  • Srikanth 
  • Telugu NEws 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS