కేసీఆర్.. జగన్.. ఆ ముఖ్యమంత్రి చేస్తున్న పని చూశారా?

Update: 2022-01-05 04:06 GMT
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తప్పనిసరిగా చూడాల్సిన సీన్ గా ఈ ఉదంతాన్ని చెప్పాలి. కరోనా వేళ.. అందరికి ఆదర్శంగా ఉండాల్సిన సీఎంలు.. అందుకు భిన్నంగా తమను చూసి మిగిలిన వారు సైతం.. ముఖానికి పెట్టే మాస్కులు తీసేసేలా వ్యవహరిస్తుంటారు. ప్రెస్ మీట్ మొదలుకొని ఏదైనా కార్యక్రమంలో పాల్గొనటం వరకు. అందుకు భిన్నంగా పొరుగున ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి మాత్రం అందుకు భిన్నంగా.. మిగిలిన ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

మూడో వేవ్ ముంచుకొచ్చేస్తున్న వేళ.. ఆయన ప్రజల్లో మాస్కుల అవసరాన్ని.. దాని ప్రాధాన్యతను తెలిసేలా వ్యవహరిస్తున్నారు. సుదీర్ఘకాలం సీఎం కుర్చీలో కూర్చోవాలన్న కలను తీర్చుకున్న ఆయన.. అంచనాలకు మించి వినూత్న నిర్ణయాలతో అందరి మనసుల్ని దోచుకుంటున్నారు. దేశంలోని ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా ఆయన నిలుస్తున్నారు.

దేశ వ్యాప్తంగా మూడో వేవ్ ముంచుకొస్తూ.. కేసులు భారీగా పెరిగిపోతున్న వేళ.. చెన్నై వీధుల్లో తన కాన్వాయ్ ను ఆపి.. మాస్కులు లేకుండా తిరుగుతూ.. నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న వారికి మాస్కులు పంచి పెట్టారు. స్వయంగా పలువురి ముఖానికి మాస్కులు తగిలించటం ద్వారా ఇలాంటి పనులు చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి స్టాలిన్ అన్న భావన కలిగేలా చేశారు.
Read more!

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించటంతో పాటు.. వ్యాక్సిన్ వేయించుకోవటం.. ఎప్పటికప్పుడు చేతుల్ని శానిటైజ్ చేసుకోవటం.. భౌతికదూరం పాటించటం లాంటి చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరుతున్నస్టాలిన్ చూసైనా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాస్తంత మారితే బాగుండు. ఒకరేమో అయితే ప్రగతిభవన్ కాదంటే ఫాంహౌస్ (అదేనండి ఫార్మర్ హౌస్).. ఇంకొకరేమో తాడేపల్లి రాజసౌధం నుంచి బయటకు వచ్చి.. ఇలా వీధుల్లో తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టొచ్చు కదా?







Full ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News