సెక్స్ కు ముందు స్పర్శతోనే సంకేతమా?

Update: 2021-02-25 03:30 GMT
ఇప్పుడు బహిరంగంగా కౌగిలించుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం చాలా కామన్. మన స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలా రోజుల తర్వాత కలిస్తే మనకు తెలియకుండా వారిని కౌగిలించుకుంటాం. అవసరమైతే ముద్దులు పెట్టుకుంటాం. అయితే ఇదంతా పాశ్చాత్య సంస్కృతి అని భారతీయ సంస్కృతి కాదనే వారు ఉన్నారు. భారతీయ సమాజంలోని కట్టుబాట్లు.. బహిరంగంగా ఇద్దరు వ్యక్తులు ప్రేమను ప్రదర్శించడాన్ని తప్పుగా పరిగణిస్తారు.

ఇక బహిరంగంగా స్త్రీ, పురుషుల మధ్యల ముద్దులు,హగ్లులను ఇప్పటికీ సమాజంలో వ్యతిరేకంగానే చూస్తారు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. జూమ్ కాల్ లో సీరియస్ గా ప్రసంగిస్తున్న ఒక భర్తను భార్య ముద్దు పెట్టుకోవడం అందరినీ నవ్వులు పూయించింది. అయితే ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసి ఈ ఏడాది ఉత్తమ భార్య ఆమెనే అని.. కానీ ఆమె ముద్దును విసుగ్గున్న భర్త మాత్రం కాదని ట్వీట్ చేశాడు.

వారు వృద్ధులైనా అంతలా ముద్దులు పెట్టుకున్న వైనమే వైరల్ అయ్యింది.  అయితే మానవ జీవనంలో ఇప్పటికీ స్పర్శ అనేది ప్రేమను వ్యక్తపరుస్తుంది.  సంతోషంలోకానీ.. కష్టంలో కానీ ఉన్నప్పుడు స్పర్శ ఒక భరోసాను ఇస్తుందని సైకాలజిస్టులు తెలిపారు. అయితే సంప్రదాయ కట్టుబాట్లు పాటించే సమాజంలో మాత్రం బహిరంగంగా ప్రేమను ప్రదర్శించకపోవడానికి సిగ్గు, భయం, అభద్రతాభావం కారణం అయ్యి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

ప్రతీ స్పర్శ అనేది సెక్స్ కు దారితీయకపోవచ్చని..కానీ స్పర్శను సెక్స్ కి ఆరంభ సంకేతంగా చూడడమే సమాజం బహిరంగ ప్రేమను ప్రదర్శించడానికి ఆమోదించకపోవడానికి కారణం కావచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు.
Tags:    

Similar News