• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  క్రైస్తవులతో...

క్రైస్తవులతో పూజలందుకుంటున్న శివలింగం.. ఏ దేశంలో అంటే ?

By - Tupaki Desk
Update: 2021-08-05 11:30 GMT
త్రిమూర్తులో శివయ్యకుండే ప్రత్యేకతే వేరు. రూపురేఖల్లోను, పూజల్లోను, భక్తులకు కోరికలు తీర్చే విషయంలోను శివయ్య వేరు. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే పరమశివుడు. ఎంత ఆగ్రహం ఉంటుందో అంతగా అనుగ్రహించటంలో బోళాశంకరుడిని మించినవారు లేరు. శివుడికి మన భారతదేశంలోనే కాదు చాలా దేశాల్లో గుడులు ఉన్నాయి. ఆ గుళ్లలో ఎన్నో రహస్యాలు, మరెన్నో మర్మాలు కొలువుదీరి ఉంటాయి. ఐర్లాండ్‌ లో ఉన్న ఈ శివలింగాన్ని ధ్వంసం చేయాలని ఎన్నిసార్లు యత్నించినా అది సాధ్యం కాలేదు అంటే ఆ శివయ్య మహత్యాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. 2012లో ఓ వ్యక్తి ఏకంగా 11 సార్లు దాడి చేసినా, 2014లో కొందరు వ్యక్తులు శివలింగం పై పెయింట్ పోశారు.

మరెన్నోసార్లు క్షుద్రపూజలు చేసిన ఘటనలు జరిగాయి. కానీ పరమరుద్రుడికి ఎటువంటి విధ్వంసం జరగలేదు. ప్రపంచంలో అత్యంత రహస్యమైన శివలింగం ఐర్లాండ్‌ లో ఈ పురాతన శివలింగం. మీత్ కౌంటిలోని తారా పర్వత ప్రాంతాల్లో కొలువైన ఈ శివలింగం వెనక ఎన్నో రహస్యాలు దాగున్నాయి. చుట్టూ రాతి ఇటుకలతో పొడవైన శిలగా ఉంటుందీ లింగం. భూమిలోంచి పొడుచుకొచ్చినట్లుగా కనిపిస్తుందీ శివలింగం. వందల ఏళ్ల కింద దీన్ని గుర్తించారు. స్థానికులు ఈ శివలింగాన్ని లియా ఫెల్ అని పిలుస్తారు. అంటే స్థానిక భాషలో అదృష్ట శిల అని అర్థం. ఈ శివలింగాన్ని ధ్వంసం చేయానికి గతంలో చాలా మంది ప్రయత్నించారు. కానీ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఒక్క పెచ్చుకూడా ఊడలేదు. ఈనాటికి ఈశివయ్య లింగం చెక్కుచెదరకుండా ఈనాటికీ అలాగే ఉంది.

అతిపురాతన లింగాన్ని క్రైస్తవ సన్యాసులు పునరుత్పత్తికి చిహ్నంగా భావి పూజించేవారు. ఈ లింగం ప్రస్తావన మైనర్స్ ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్ నేనే గ్రంధంలో ఉంది. క్రీస్తుశకం 1632 నుంచి 1636 మధ్య ఈ ప్రాంతంలో ఈ శివలింగాన్ని త్వాతా డి డానన్ తెచ్చినట్లు చారిత్రాత్మక కథనం.త్వాతా డి డానన్ ను, డాను అనే దేవత కొడుకుగా చెప్పేవారు. యూరప్ పురాణాల ప్రకారం డాను దేవత  నది దేవత. డాన్యూబ్, డాన్, డానిపెర్, డానిస్టర్ నదులకు డాను దేవత పేరుతో సంబంధం కనిపిస్తుంది. మన వేదాల్లో కూడా డాను దేవత ప్రస్తావన ఉంది. ఆమె కశ్యప ముని భార్య అయిన దక్ష కూతురు. ఆమె నదులకు అధిపతి. డాను అంటే ప్రవహించే నీరు అని సంస్కృతంలో అర్ధం. ఐర్లాండ్‌ లో లియా ఫాయిల్ కి వేద సంస్కృతంలో శివుడికీ సంబంధం ఉన్నాదని చారిత్రికుల కధనం.

అదృష్ట శిలగా చెప్పుకునే ఈ లియా ఫెల్ లింగానికి ఎంతో చరిత్రం ఉంది. ఇది ఈనాటిది కాదు..క్రీ.శ. 1632-1636 మధ్య కాలంలో ఫ్రెంచ్ సాధువులు రచించిన పురాతన గ్రంథం ది మైనర్స్ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్ లో ఈ శివలింగానికి సంబంధించిన కొన్ని వివరాలు పొందుపరిచి ఉన్నాయట. 'తుథాడి దేనన్' వర్గానికి చెందిన ఓ నేత దీన్ని స్థాపించినట్లు ఆ పురానత గ్రంథంలో రాయబడి ఉంది. తుథాడి దేనన్ అంటే 'దను' దేవత పిల్లలు అని అర్థం. వీళ్లు క్రీ.పూ. 1897 నుంచి 1700 వరకు ఐర్లాండ్‌ని పాలించారు. క్రైస్తవ సన్యాసులు ఈ శివలింగాన్ని పునరుత్పతి సామర్థ్యానికి చిహ్నంగా భావించేవారట.  

యూరోపియన్ సంప్రదాయాల్లో దనను నదీ దేవతగా కొలుస్తారు. ఆమె పేరు మీదుగానే దేన్యూబ్, దోన్, డనీపర్, డినియెస్టర్ నదులకు పేర్లు వచ్చాయట. దును దేవత ప్రస్తావన మన భారతదేశపు వేద సంస్కృతిలో కూడా ఉంది. దను దేవత శివుడికి మామ అయిన దక్ష ప్రజాపతి కూతురు. ఆమెను దక్ష ప్రజాపతి కశ్యప మునీశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడు. దను దేవతను నదీ దేవతగా కొలుస్తారు. దను సోదరి సతీ దేవి. అంటే శివుడి భార్య. ఆమెనే పార్వతి అని ఉమ ఇలా ఎన్నో నామాలతో పిలుస్తారు. తండ్రిని కాదని సతీదేవి శివుడిని వివాహమాండింది. ఆ తరువాత తండ్రి ఇంట జరిగిన దక్ష యజ్ఞంలో సతీదేవికి జరిగిన అవమానంలో తన బొటన వేలుని నేలపై రాసి అగ్నిని పుట్టింది ఆ అగ్నిలో దహనమైపోయింది సతీదేవి. ఆ తరువాత జన్మలో సతీదేవి పార్వతిగా అవతారమెత్తి శివుడిని వివాహం చేసుకుంది. వేద సంస్కృతిని విశ్వసించే వాళ్లు ఐర్లాండ్‌లోని లియా ఫైల్‌ ని శివలింగంగా భావిస్తారు.
Tags:    
  • Ireland 
  • Christians 
  • Lord Shiva 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS