మిడతల ముప్పు ఈసారికి మిస్ అయినా.. మళ్లీ ముంచుకు వస్తుందా?

Update: 2020-06-11 05:00 GMT
ఆ మధ్యన మిడతల దండు మీద మస్తు వార్తలు రావటం.. జనాలు వణికిపోవటం తెలిసిందే. నగరాల మీద కన్నేయని మిడతల దండు.. గ్రామీణ ప్రాంతాల మీదకు విరుచుకుపడటం.. పంటల్ని రోజుల్లోనే పీల్చి పిప్పి చేసేయటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి ముప్పు ఉందన్న అంచనాలకు భిన్నంగా మిడతల ముప్పు మిస్ అయ్యింది. హమ్మయ్యా.. అని గుండె దిటువ చేసుకునే వేళలో మిడతల ముప్పు ఉందన్న ప్రభుత్వ హెచ్చరిక ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

తెలంగాణ - మహరాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా వచ్చేసిన మిడతల దండే.. గాలి వీయటంలో కాస్త తేడా జరిగినా.. మిడతల ప్రయాణం తెలంగాణవైపుకు వచ్చేస్తుందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. తెలంగాణకు ఇబ్బందేనని చెబుతున్నారు. అధికారుల అంచనాలు నిజమైతే.. ఈ నెల 20 నాటికి రాష్టానికి మిడతలు వచ్చేస్తాయన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ.. ఈసారికి ముప్పు మిస్ అయినా.. వచ్చే నెల (జులై) ఐదున మరోసారి ముప్పు ఉందని తేల్చారు. నిజానికి.. ఇప్పుడు కాకుండా జులై మొదటి వారంలో మిడతల దండు తెలంగాణకు వస్తే జరిగే నష్టం ఎక్కువని చెబుతున్నారు.

ఎందుకంటే.. అప్పటికి పంటలు పెరుగుతాయని చెబుతున్నారు. మిడతల కారణంగా ఖమ్మం.. వరంగల్.. కరీంనగర్.. నిజామాద్.. అదిలాబాద్ తదితర జిల్లాలకు ముప్పు తప్పదంటున్నారు. రాష్ట్రానికి మిడతలు వచ్చే అవకాశం ఉన్న వేళ.. ఆ ముప్పును ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. మిడతలకు చెక్ చెప్పే వ్యూహాన్ని సిద్ధం చేయనున్నారు. మిడతల్ని నియంత్రించేంత సామర్థ్యం రాష్ట్రానికి ఉందా? అన్న ప్రశ్నకు ఎవరూ సరిగా సమాధానం చెప్పలేకపోవటం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.
Tags:    

Similar News