మిడతల దండు ముప్పు: హర్యానా ఆందోళన

Update: 2020-06-27 09:30 GMT
#మిడతల దండు వ్యాప్తి ఇప్పట్లో తొలగిపోయే అవకాశం లేదు. ఈ ముప్పు ఇంకా దేశానికి పొంచి ఉంది. తాజాగా హర్యానాకు ఈ దండు దూసుకొస్తోంది. దీనిపై ఆ రాష్ట్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. హర్యానాలోని ప్రభు గుర్గావ్, మహేంద్ర గడ్ వంటి జిల్లాల్లో ఈ మిడతల బెడద ప్రారంభమైంది. దీన్ని గ్రహించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మిడతలు రాకుండాని ప్రజలు తమ ఇళ్ల కిటికీలను మూసి ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు.

టిఫిన్ బాక్సులు, పళ్లాలపై శబ్దాలు చేస్తూ ఉండాలని సలహాలు ఇస్తోంది. ఇలా చేస్తే అవి ఇళ్లు , పొలాలపై పడకుండా వెళ్లిపోతాయని సూచిస్తున్నారు. ఒకే చోట ఆ మిడతలు ఉండకుండా తరిమివేయాలని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ మిడతలు వస్తే రైతులు కూడా క్రిమి సంహారక మందులను చల్లే తమ స్ప్రే పంపులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పలు జిల్లాలోని గ్రామాల్లో ప్రజలకు వీటి నివారణపై అవగాహన కలిగించే చర్యలు చేపట్టాలని హర్యానా ప్రభుత్వం వ్యవసాయ శాఖ సిబ్బందిని  ఆదేశించింది.

ఈ మిడతలు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దాడి చేసి పంట పొలాలను నాశనం చేసిన విషయం తెలిసిందే. మిడతల వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం 11 కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటుచేసింది. ముందే అప్రమత్తమైతే పంట నష్టం కాకుండా చర్యలు తీసుకుంటే రైతులకు నష్టం వాటిల్లిదని అధికారులు చెబుతున్నారు.
Tags:    

Similar News