లాక్ డౌన్ పొడిగిస్తే ఆర్థిక వినాశనం తప్పదు !

Update: 2020-05-26 05:30 GMT
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉండే ప్రఖ్యాత వ్యాపార వేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. లాక్‌ డౌన్ పొడిగించడంపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడానికి లాక్ ‌డౌన్ పొడిగించడం ఏ విధంగానూ ఉపయోగపడదని, అదే సమయంలో కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో విధాన నిర్ణేతలకు ప్రత్యామ్నాయ అవకాశాలు తక్కువే ఉన్నాయని, కానీ లాక్ ‌డౌన్‌ పొడిగించడం వల్ల ప్రయోజనం మాత్రం ఉండబోదని మహీంద్రా అభిప్రాయపడ్డారు

ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన ఆయన.. లాక్‌ డౌన్‌ ల వల్ల ఆర్థికంగా భయంకరమైన నష్టం వాటిల్లుతుంది. అంతేగాక మరోసారి ఆరోగ్య విపత్తుకు దారి తీస్తుంది అని చెప్పారు.  మానసిక ఆరోగ్యంపై లాక్‌ డౌన్‌ ప్రతికూల ప్రభావాలు, వైరస్ సోకని రోగులు నిర్లక్ష్యానికి గురయ్యే భారీ రిస్కులను గురించి తాను గతంలో ప్రస్తావించిన కథనాన్ని  గుర్తు చేశారు. కరోనా వైరస్‌ కేసులు పెరుగుతూనే ఉంటాయని, ఆస్పత్రులలో ఆక్సిజన్‌ అందుబాటులో ఉండే పడకల సంఖ్య వేగంగా, గణనీయంగా పెంచాల్సి ఉంటుందని మహీంద్రా తెలిపారు. ఆర్మీకి ఈ విషయంలో అపార అనుభవం ఉందని తెలిపారు. 49 రోజుల తర్వాత లాక్‌ డౌన్ ‌ను సమగ్రమైన విధంగా ఎత్తివేయాలంటూ మహీంద్రా గతంలో కూడా ప్రతిపాదించారు. 
Tags:    

Similar News