హైదరాబాద్ ఔటర్ పై ఎల్‌ ఈడీ వెలుగులు !

Update: 2020-11-12 12:10 GMT
హైదరాబాద్‌ కే తలమానికమైన ఔటర్‌ రింగ్‌ రోడ్డు 158 కి.మీ మేర ఉంది. ఈ ఔటర్ పై  ఇప్పటికే గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ కు 24 కి.మీ మేర ఎల్‌ఈడీ బల్బుల వెలుగులు 2018 నుంచి ప్రారంభమయ్యాయి. ఇన్ని రోజులు  మిగిలిన ప్రాంతాల్లో ఎల్‌ ఈడీ బల్బుల వెలుగులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన అధికారులు 0 నుంచి 136 కి.మీ వరకు  ...  కోకాపేట నుంచి కొల్లూరు, పటాన్ ‌చెరు, దుండిగల్‌ తదితర ప్రాంతాల మీదుగా శంషాబాద్‌ వరకు  ఎల్‌ ఈడీ వెలుగులు వచ్చేలా ప్లాన్ సిద్ధం చేశారు.

నాలుగు ప్యాకేజీల కింద దాదాపు రూ.107.50 కోట్లతో  ఈ పనులను వివిధ ఏజెన్సీలకు అప్పగించారు. ఇప్పటికే  డిజైనింగ్‌ పనులకు సిద్ధమయ్యారు. దీపావళికి ముందు అధికారికంగా ప్రారంభమయ్యే పనులను దాదాపు ఏడాదిలోనే పూర్తి చేయనున్నారు. సుమారు 7 వేల స్తంభాలు, 14 వేల ఎల్ ‌ఈడీ బల్బులను ఇటు ఓఆర్‌ ఆర్‌ మెయిన్‌ క్యారేజ్‌ వే, ఇంటర్‌ చేంజ్‌లు, జంక్షన్లు, సర్వీస్ ‌ రోడ్లు, అండర్‌ పాస్‌ ల్లో బిగించనున్నట్లు హెచ్ ‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఓఆర్‌ ఆర్‌ మొత్తంలో ఈ వెలుగుల పనులు పూర్తయితే దేశంలోనే తొలి ప్రాజెక్టు అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఓఆర్‌ ఆర్‌ పై రాత్రి వేళలో వాహనదారుల కదలికల్ని బట్టి ఈ బల్బుల వెలుగులు ఉంటాయి. వాహనాల రాకపోకలు ఉన్న సమయంలో పూర్తిస్థాయిలో వెలుగులు ఉండేలా.. అవి లేని సమయాల్లో ఆటోమేటిక్‌ డీమ్‌ అయ్యేలా అధికారులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. రిమోట్‌ నుంచి పనిచేసేలా చేస్తున్న ఈ వ్యవస్థ ద్వారా కూర్చున్న చోట నుంచే అంటే తమ సెల్ ‌ఫోన్‌ ల నుంచే లైట్లు వెలుగుతున్నాయా లేదా ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా అనే తెలుసుకునే ‘ఆటోమేషన్‌’ ఉందని హెచ్‌ ఎండీఏ అధికారులు చెబుతున్నారు.
Tags:    

Similar News