ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం విషమం
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ సలహాదారు.. సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ (71) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. గత అక్టోబర్ 1న ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత కూడా అహ్మద్ పటేల్ ను పలు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయని సమాచారం.
ప్రస్తుతం అహ్మద్ పటేల్ గురుగావ్ లోని మేదాంత ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇన్ ఫెక్షన్ కారణంగా ఆయన ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని.. ఇతర కీలక అవయవాలపై కూడా ఆ ప్రభావం పడిందని అంటున్నారు.
అహ్మద్ పటేల్ ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్వీట్ చేశాడు. ‘నాన్న గారి పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. ఆయన త్వరగా కోలుకునేలా అంతా ప్రార్థించాలని కోరుతున్నాను’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో సోనియా తర్వాత అత్యంత బలమైన నేతగా అహ్మద్ పటేల్ యూపీఏ హయాంలో వెలుగువెలిగారు. సోనియాకు వ్యక్తిగత సలహాదారుగా.. అత్యంత నమ్మకస్తుడైన నేతగా పేరు తెచ్చుకున్నాడు. తెలంగాణ ఏర్పాటులోనూ ఈయన కీలకంగా వ్యవహరించారు.