న్యాయవాదుల హత్య: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
పెద్దపల్లి జిల్లాలో హత్యకు గురైన న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.కుంట శ్రీను, చిరంజీవి అనే ఇద్దరు పథకం ప్రకారమే న్యాయవాద దంపతులను హతమార్చినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
హత్య చేసిన తర్వాత నిందితులు రామగిరి నుంచి మహారాష్ట్రకు పరార్ అయినట్లు పోలీసులు గుర్తించారు. సుందిళ్ల బ్యారేజ్ లో కత్తులు, బట్టలు పడేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.సుందిళ్ల బ్యారేజీ దగ్గరే వేరే బట్టలు మార్చుకొని మహారాష్ట్రకు పరారయ్యారని పోలీసులు తెలిపారు.న్యాయవాది వామన్ రావుకు సంబంధించిన సమాచారాన్ని లచ్చయ్య ఎప్పటికప్పుడు కుంట శీనుకు అందించేవాడని పేర్కొన్నారు.
ఇక హత్యకు వినియోగించిన కత్తులు, వాహనం బిట్టు శీను సమకూర్చాడని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో ఇద్దరు నిందితులు కుంట శ్రీను, లచ్చయ్య పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.