కరోనా బారినపడ్డ లవ్ అగర్వాల్

Update: 2020-08-15 05:30 GMT
కాదెవరు కరోనాకు అనర్హం అన్నట్టుగా దేశంలో అందరికీ సోకుతోంది ఆ మహమ్మారి. ఇప్పటికే కేంద్రహోంమంత్రి అమిత్ షా నుంచి మొదలు పెడితే రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులకు సోకిన కరోనా ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు.

తాజాగా కరోనా వైరస్ పై ప్రతీరోజు బులిటెన్లు విడుదల చేస్తూ దేశ ఆరోగ్యరంగాన్ని పర్యవేక్షించే పెద్ద అధికారి.. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కరోనా బారినపడ్డారు.

తాజాగా లవ్ అగర్వాల్ తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉంటున్నట్టు వివరించాడు. ఇటీవల తనను కలిసిన వారంతా హోం ఐసోలేషన్ ఉండాలని కోరారు.

దేశంలో కరోనా లాక్ డౌన్ సమయంలో లవ్ అగర్వాల్ ప్రతీరోజు కరోనా పరిస్థితి కేంద్రం చర్యలు తదితర అంశాలపై రోజూ మీడియా సమావేశంలో వెల్లడించేవారు. ఆయనే కరోనా బారినపడడం అధికారవర్గాల్లో కలకలం రేపింది.
Tags:    

Similar News