• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కర్నాటకలో పట్టు...

కర్నాటకలో పట్టు దొరికింది...కేసీయార్ దూకుడేనట..

By - Tupaki Desk
Update: 2022-10-16 03:30 GMT
కేసీయార్ ఆషామాషీగా ఏమీ బీయారెస్ పెట్టలేదు. ఆయన జాతీయ రాజకీయాల్లో తన వాటా ఎంతో చూసుకుని దాని తేల్చుకోవడానికే పార్టీ పెట్టారని అంటున్నారు.

ఈ రోజున రాజకీయాల్లో నంబర్ గేమ్  నడుస్తోంది. ఎవరికి ఎక్కువ సీట్లు ఉన్నా ఒక్క సీటు లేకపోతే సర్కార్లే కూలిపోతాయి అనడానికి వాజ్ పేయ్ సర్కార్ అప్పట్లో గద్దె దిగడం ఒక ఉదాహరణ. అందువల్ల 2024లో కచ్చితంగా సంకీర్ణం వస్తుంది కేంద్రంలో అని భావించే కేసీయేఅర్ బీయారెస్ కి రెడీ అయ్యారు.

ఆయనకు ఇపుడు కర్నాటకలో పట్టు ఎంతో కొంత దొరికింది అని అంటున్నారు. పూర్వపు హైదరాబాద్ స్టేట్ లో కర్నాటకలో కలసిన కొన్ని జిల్లాలు  ఉన్నాయి. దాంతో ఆ జిల్లాలలో కనుక గట్టిగా పట్టుకుంటే గెలుపు సాధ్యమే అని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికి పదేళ్ల క్రితం కన్నడ రాష్ట్ర తెలంగాణా అసోసియేషన్ ని ఏర్పాటు చేశారు. దానికి టీయారెస్ మద్దతు ఉంది ఈ  అసోసియేషన్ కర్నాటకలో ఉన్న తెలంగాణా వారి కోసం ఏర్పాటు అయింది.

తెలంగాణా కల్చర్ ని ప్రమోట్ చేసుకోవడమే కాకుండా అక్కడ ఫెస్టివల్స్ ని చేసుకోవడం, ఎప్పటికపుడు తెలంగాణా కార్యక్రమాలను  ప్రమోట్ చేయడం చేస్తోంది. ఇపుడు ఆ అసోసియేషన్ ముందుకు వచ్చి బీయారెస్ కి పూర్తి మద్దతు ప్రకటించింది. సరిహద్దు జిల్లాలలో బీయారెస్ సంబరాలు ఒక లెక్కన సాగుతున్నాయని టీయారెస్ అఫీషియల్ మీడియాలో వార్తలు వస్తున్నాయిట.

మొత్తానికి ఈ సరిహద్దు రాష్ట్రాలలో బీయారెస్ కనుక పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఆ ఎన్నికల్లోనే బీయారెస్ తన జాతాకాన్ని పరీక్షించుకుని 2024 లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతుంది అని అంటున్నారు. ఇప్పటికే కన్నడ నాట జేడీ ఎస్ బీయారెస్ కి మద్దతు ప్రకటించింది.

దాంతో ఈ రెండు పార్టీలు పొత్త్లు పెట్టుకుని పోటీలోకి దిగిగే కన్నడ నాట బీయారెస్ జెండా ఎగరడం ఖాయమే అని అంటున్నారు. సో కేసీయార్ జాతీయ పార్టీకి కొత్త ఆశలు కన్నడ నాటనే కనిపిస్తున్నాయట. ఆ మీదట ఆయన ఎత్తులు పై ఎత్తులూ ఎటూ ఉంటాయి కాబట్టి మిగిలిన రాష్ట్రాలలో కూడా దూకుడు చేస్తారు అని అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Telangana 
  • Telanganacm 
  • Kcr 
  • Trsparty 
  • Nationalparty 
  • Brsparty 
  • Karnataka 
  • Kcrcomments 
  • Latestnews 
  • Politicalnews 

Similar News

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS