'భూ వివాదం' .. టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త అరెస్ట్!

Update: 2020-07-17 10:10 GMT
భూ వివాదంలో  బ్యాంకు ఉద్యోగి పురేంధర్‌ రెడ్డి పై దాడి చేసిన ఘటనలో బోడుప్పల్ టీఆర్ ఎస్ కార్పొరేట్ భర్త శ్రీధర్ గౌడ్‌ ను  పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం రోజుల కిందట బోడుప్పల్ కార్పొరేటర్ భర్త శ్రీధర్ గౌడ్, ఆయన అనుచరులు పురేంధర్ రెడ్డి ఇంటికి వెళ్లి అతని పై విచక్ష ణారహితంగా దాడి చేశారు. మా నాన్న ను కొట్టొద్దు అని తన కుమారుడు కాళ్లు పట్టుకొని ఏడ్చినా ఏ మాత్రం కనికరం చూపకుండా నిర్దాక్షిణ్యంగా రక్తం వచ్చేటట్టు కొట్టారు. పురేంధర్‌ రెడ్డి హైదరాబాద్‌ లోని ఓ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘట పై పురేంధర్ రెడ్డి భార్య మేడిపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆయన్ని ఈ రోజు బీబీ నగర్ టోల్ గేట్ వద్ద పోలీసులు  అరెస్ట్ చేసారు.

ఈ ఘటన పై పూర్తీ వివరాలు చూస్తే ... బోడుప్పల్‌ ద్వారకానగర్‌ ఫేజ్‌-2 లో బి.పురంధర్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం బ్యాంక్‌ ద్వారా ఇంటిని కొనుగోలు చేశాడు. తమ స్థలంలో ఇల్లు నిర్మించారని బందారం కుటుంబానికి చెందిన వ్యక్తులు తరచూ ఆయనతో గొడవ పడేవారు. శుక్రవారం శ్రీధర్‌ గౌడ్‌, అతడి అనుచరులు కర్రలతో పురంధర్‌ రెడ్డి పై దాడి చేశారు. దీంతో గాయాలపాలైన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటనపై పోలీసులు సరిగా స్పందించడం లేదని ఆరోపిస్తూ.. పురంధర్‌రెడ్డి భార్య భానోదయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. దాడి ఘటనకు సంబంధించిన వీడియోను అందజేసింది. దీనితో ఈ  కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు నేడు ఆయన్ని అరెస్ట్ చేసారు. 
Tags:    

Similar News