• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎర్రచందనం లేడీ డాన్‌...

ఎర్రచందనం లేడీ డాన్‌ ఏమయ్యారు..?

By - Tupaki Desk
Update: 2015-04-09 14:30 GMT
శేషాచలం అడవుల్లో భారీ ఎన్‌ కౌంటర్‌ దెబ్బకు ఎర్రచందనం స్మగ్లర్లంతా అండర్‌ గ్రౌండ్‌ లోకి వెళ్లిపోయారు. గతంలో తిరుపతి సమీపంలోని భాకరాపేట నుండి బెంగళూరు మీదుగా మంగళూరు పోర్టుకు ఎర్రచందనం రవాణా యమాజోరుగా సాగేది.  చిత్తూరు జిల్లాకు చెందిన ఒక రాజకీయ నాయకుడి అండతో కర్ణాటకలోని కోలారు జిల్లాకు చెందిన ఒక మహిళ గత 15 ఏళ్లుగా ఈ స్మగ్లింగ్‌ లో ఆరితేరిపోయారు. ఆమెను చిత్తూరు అటవీ శాఖ అధికారులు అనేక సార్లు అరెస్టు చెయ్యడానికి విఫలయత్నం చేశారు. నిత్యం 20 మందికి తగ్గకుండా ఆమె చుట్టూ అనుచరులు ఉంటారు. దీంతో తిరుపతి ప్రాంతంలో ఆమెను అంతా లేడీ డాన్‌ అంటారు.

    ఎర్రచందనాన్ని రోడ్డు మార్గంలో రహస్యంగా తరలించడంలో ఆమెను మించినవారు లేరని పేరు. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో పోలీసులను, అటవీ అధికారులను బురిడీ కొట్టించేది. అంబులెన్సులు, నీళ్ల ట్యాంకులు, పెట్రోలు ట్యాంకులు, పాల ట్యాంకర్లే కాదు... చివరకు సెప్టిక్‌ ట్యాంకుల క్లీనింగు వాహనాల్లోనూ ఎర్రచందనం తరలించేవారు. బెంగళూరులోని వ్యాపారులు ఈమె దగ్గర ఒక కేజీ ఎర్రచందనం రూ. 3 వేల నుండి రూ. 5 వేల వరకూ కొనుగోలు చేస్తారని చెప్తుంటారు.     అయితే, వ్యూహరచనలో ఆరితేరిన ఆమె ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసిన సమయంలోనే తన కార్యకలాపాలు తగ్గించారని సమాచారం. తాజాగా శేషాచలం అడవుల్లో 20 మంది తమిళ కూలీలు ఎన్‌ కౌంటర్‌ కావడంతో లేడి డాన్‌ తో పాటు ఆమె అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అంటున్నారు.

Tags:    
  • Lady involvements 
  • Red Sandalwood Smuggling 

Similar News

డిసెంబరులో కీలక మార్పులు.. రాయలసీమ నుంచి కొత్త మంత్రులు

2026-11-02 13:55 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

'పదకొండు' ముహూర్తం బాగుంది.. వాళ్లు భుజాలు తడుముంటే నేనేం చేయాలి : విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-02 13:50 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

వరుస తుఫాన్లు.. చంద్రబాబుకు ఎన్నో విధాల మేలు

2026-11-02 12:30 GMT

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

Copyright @2026

Powered by Blink CMS