కుప్పంపై కన్ను.. ప్రశాంత నియోజకవర్గంలో భోగి మంటలు!!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం ప్రశాంతతకు మారు పేరు. గత 35 ఏళ్లుగా ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబా బు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయినా..ఎక్కడా ఇప్పటి వరకు ఎలాంటి చిన్న వివాదం.. విభేదం అనేది బయ ట కూడా పడలేదు. అంతేకాదు.. అసలు ఈ నియోజకవర్గంపై కుట్రలు పన్నిన వారు.. ఈ నియోజకవర్గంలో చంద్రబాబును ఓడించాలని కంకణం కట్టుకున్నవారు కూడా ఎవరూ లేరు. చంద్రబాబు అంటే.. రాజకీయంగా కత్తులు నూరిన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కుప్పంలో ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు.
ఇక్కడ ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించనూ లేదు. అన్నింటికీ మించి.. చంద్రబాబును ఓడించాలనే ఆలోచన కూడా ఎవరూ చేయలేదు. అయితే.. వైసీపీ అధినేత జగన్ మాత్రం కుప్పాన్ని టార్గెట్ చేసుకున్నారు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయందక్కించుకున్నా.. జగన్‌కు సంతృప్తి కనిపించలేదనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబును ఓడించి రికార్డు సృష్టించాలనే విపరీత మనస్తత్వం జగన్‌లో చోటు చేసుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కుప్పంపై ఆది నుంచి ఆయన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
కుప్పంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో సామదాన బేధ దండోపాయాలను వినియోగించి వైసీపీ విజయం దక్కించుకుంది. అదేసమ యంలో కుప్పంనుమినీ మునిసిపాలిటీగా మార్చింది. 6వేల కోట్ల రూపాయలతో అభివృద్ధిపనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేశారు. ఇక, నియోజకవర్గంలో భరత్‌ను ఇంచార్జ్‌గా నియమించారు. వచ్చే ఎన్నికల్లో ఈయనకే టికెట్ ఇస్తారనే ప్రచారం ఉంది. మరోవైపు.. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డెప్పలకు నియోజకవర్గాన్ని పూర్తిగా చేతిలో పెట్టారు. దీంతో వీరిద్దరూ ప్రతి రోజూ ఇక్కడ ఏంజరుగుతోందనే విషయాలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ పరిణామాలతో టీడీపీ నేతలు.. ఏ కార్యక్రమం చేయాలన్నా జంకుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో చంద్రబాబుకూడా అలెర్ట్ అయ్యారు. 35 ఏళ్లలో పెద్దగా నియోజకవర్గానికి రాకుండానే ఇక్కడ పనులు చేసిన ఆయన.. ఇప్పుడు ప్రతి మూడు నాలుగు నెలలకు వస్తున్నారు. గతంలో అసలు సభలు, సమావేశాలు పెట్టని చంద్రబాబుఇప్పుడు సభలు సమావేశాలు పెడుతున్నారు. ప్రతి ఒక్కరినీ కలుస్తున్నారు. అంటే.. వైసీపీవ్యూహానికి ప్రతివ్యూహంతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.
ఇదే ఇప్పుడు వైసీపీలో మళ్లీ గుబులు రేపుతోందనే కామెంట్లు వినిపించేలా చేస్తోంది. చంద్రబాబు వచ్చి మళ్లీ ఇక్కడ పుంజుకుంటారని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం తాజాగా కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించాలని తలపెట్టిన చంద్రబాబుకు అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం ఏర్పరిచింది. జీవో 1ని అప్పటికప్పుడువండి వార్చిన వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు సభకు, రోడ్‌షోకు అనుమతి లేదని పేర్కొంది. ఇది తీవ్ర వివాదంగా మారింది. దీంతో ప్రశాంతంగా ఉండే నియోజకవర్గంలో ఇప్పుడు ఎటు చూసినా..పోలీసులు, ఎక్కడ విన్నా.. బూటు చప్పుళ్లు, పోలీసు వాహనాల డేంజర్ సైరన్లే వినిపిస్తున్నాయి.