ఉత్తరాంధ్రా చరిత్రలో సరికొత్త అధ్యాయం

ఉత్తరాంధ్రా ఇక పారిశ్రామిక కేంద్రంగా మారబోతోంది. ఇప్పటిదాకా స్టీల్ ప్లాంట్ మాత్రమే విశాఖలో ఉండడం వల్ల ఇతర అనుబంధ సంస్థలు తరలి వచ్చాయి.;

Update: 2026-03-21 03:15 GMT

ఉత్తరాంధ్రా ఇక పారిశ్రామిక కేంద్రంగా మారబోతోంది. ఇప్పటిదాకా స్టీల్ ప్లాంట్ మాత్రమే విశాఖలో ఉండడం వల్ల ఇతర అనుబంధ సంస్థలు తరలి వచ్చాయి. కానీ ఇపుడు ప్రైవేటు రంగంలో ఏకంగా 18 మిలియన్ టన్నుల స్టీల్ ని ఏటా ఉత్పత్తి చేసే భారీ స్టీల్ ప్లాంట్ కి శ్రీకారం చుట్టబోతున్నారు. దానికి ఈ నెల 23వ తేదీని ముహూర్తం నిర్ణయించారు. ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు అనేక మంది అనకాపల్లి జిల్లా నక్కపల్లి కి వస్తున్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ స్థాపన కోసం జరిగే భూమి పూజలో వీరంతా పాలు పంచుకోనున్నారు.

ఉక్కు మంత్రి రాకతో :

ఇక కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న కుమార స్వామి రాకతో ఈ భారీ ప్రాజెక్ట్ స్థాపనకు కొత్త కళ రాబోతోంది. ఆయన సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం అన్నది ఈ ప్రాంతం జాతకాన్ని మారుస్తుంది అని అంటున్నారు. అలాగే మరో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, అలాగే కేంద్ర మంత్రులు భూపతి రాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ లతో పాటు కేంద్ర ఉక్కు శాఖ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ కూడా రావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం సాగనుంది అని అంటున్నారు.

భారీగా ఉపాధి అవకాశాలు :

మిట్టల్ స్టీల్ ప్లాంట్ తో ఉత్తరాంధ్రా కరవు తీరేలా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని అంటున్నారు. అరవై నుంచి డెబ్బై వేల ఉద్యోగాలు ఈ ప్లాంట్ ద్వారా రానున్నాయని చెబుతున్నారు. అదే విధంగా 2029 నాటికి ఉత్పత్తి సామర్థ్యం 17.8 మిలియన్ టన్నులతో మిట్టల్ ప్లాంట్ ఉత్తరాంధ్రా ప్రజానీకం ఆశలను తీర్చబోతోంది ఈ స్టీల్ ప్లాంట్ కనుక వస్తే అనుబంధ పరిశ్రమలు సైతం పెద్ద ఎత్తున వస్తాయని అంటున్నారు. దాంతో మొత్తంగా ఉత్తరాంధ్రా ప్రాంతం ఒక ఇండస్ట్రియల్ హబ్ గా మారడం ఖాయమని చెబుతున్నారు.

ఊహించని మార్పుతో :

ఉత్తరాంధ్రా అంటే వెనుకబడిన ప్రాంతం అని అంతా అంటారు. అదే నిజం కూడా ఇక్కడ నుంచే ఎన్నో ప్రాంతాలకు జనాలు వలస వెళ్తారు. అలాంటిది తమకు సమీపంలో భారీ ప్రాజెక్ట్ వస్తే దగ్గరలోనే ఉపాధి లభిస్తే ఈ ప్రాంతీయుల కంటే సంతోషించే వారు ఎవరూ ఉండరని అంటున్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఉత్తరాంధ్రా మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దాంతో వరస బెట్టి భారీ పరిశ్రమలు ఒక్కోటిగా తరలి వస్తున్నాయి. అయితే వాటి అన్నింటి కంటే చాలా అధిక ప్రయోజనాలతో మిట్టల్ స్టీల్ ప్రాజెక్ట్ రావడం మాత్రం విశేష పరిణామం అని అంటున్నారు. ఈ నెల 23వ తేదీ అయితే ఉత్తరాంధ్రా చరిత్రలో సరికొత్త అధ్యాయం అని అంటున్నారు.

Tags:    

Similar News