వీళ్లకు మానవత్వం ఉండదా? సమోసాల తయారీ ఇంత దారుణమా?

సమయం ఏదైనా సమోసా కనిపించినంతనే తినేద్దామన్న ఫీలింగ్ కలిగించటంలో దీని లెక్కే వేరుగా ఉంటుంది.;

Update: 2026-03-21 05:15 GMT

సమయం ఏదైనా సమోసా కనిపించినంతనే తినేద్దామన్న ఫీలింగ్ కలిగించటంలో దీని లెక్కే వేరుగా ఉంటుంది. అందునా హైదరాబాద్ మహానగరంలో గల్లీకో సమోసా షాప్ ఉండటం తెలిసిందే. కల్తీ దుర్మార్గం సమోసా లాంటి స్నాక్స్ విషయంలోనూ ఉండటం షాకింగ్ గా మారింది. ఇప్పటివరకు కల్తీ పాలు.. పన్నీర్.. అల్లంవెల్లుల్లి పేస్ట్.. మోతీచూర్ లడ్డూ.. ఇలా ప్రతి దానిని కల్తీగా మార్చేసి దుర్మార్గం.. ఇప్పుడు సమోసాకు మినహాయింపు కాదన్న విషయం తేలింది. ఒక మసోసా తయారీ కేంద్రంపై కుల్సుంపురా పోలీసులు దాడి చేయగా.. షాకింగ్ వాస్తవాలు వెలుగు చూశాయి

ఇక్కడి సమోసా తయారీ ఎంత అరాచకంగా ఉంటుందన్నది చూసిన తర్వాత సమోసాను తినాలనే ఆలోచనే చచ్చిపోయేలా ఉండటం గమనార్హం. ఈ సమోసా తయారీ కేంద్రంలో కుళ్లిన గుడ్లు..కల్తీ నూనె.. పిండి.. ఇది అది అన్న తేడా లేకుండా అన్ని కల్తీ ముడిపదార్థాలతో తయారు చేసే తీరు చూస్తే నోట మాట రాదంతే. గోల్కొండకు చెందిన 73 ఏళ్ల అబ్దుల్ రషీద్ జియాగూడ బైపాస్ రోడ్డులో మూసీ తీరంలో సమోసా తయారీని ఒక షెడ్డులో నిర్వహిస్తుంటాడు. వాటిని పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు.. బేకరీలు.. చిరు వ్యాపారులకు అమ్ముతుంటాడు.

యజమాని రషీద్ తో పాటు మరో ఐదారుగురు పని చేస్తుంటారు. ఇక్కడ తయారు చేసే సమోసాలకు మంచి ఆదరణ ఉందని చెబుతున్నా.. ఇక్కడ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించని తీరు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అంతేకాదు.. ఈ తయారీ కేంద్రానికి ప్రభుత్వ అనుమతులు కూడా లేకపోవటం గమనార్హం. పూర్తిగా నేలపై అపరిశుభ్ర వాతావరణంలో కుళ్లిన కోడిగుడ్లు..కాలం చెల్లిన కల్తీ మైదా.. కల్తీ వంట నూనెలతో పాటు కుళ్లిన కూరగాయాల్ని వినియోగిస్తూ తయారు చేసే సమోసా.. ఎంతటి అనారోగ్యానికి గురి చేస్తుందో ఆలోచించేందుకు సైతం భయం వేస్తుంది. ఈ ఉదంతం గురించి తెలిసిన తర్వాత సమోసాను అంత తేలిగ్గా తినే సాహసం చేయరని చెప్పకతప్పదు.

Tags:    

Similar News