కేటీఆర్ బస్తీకి ఎందుకెళ్లాడో తెలుసా?

Update: 2016-02-06 08:41 GMT
తమ గురించి గొప్పలు చెప్పుకునే ఏ చిన్న అవకాశాన్ని రాజకీయ నాయకులు అస్సలు వదిలిపెట్టరు. దీనికి తగ్గట్లే ఉన్నాయి మంత్రి కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు. గ్రేటర్ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న అనంతరం ఆయన.. శనివారం పలు బస్తీల్లో పర్యటిస్తున్నారు. అద్భుత విజయాన్ని సాధించిన తర్వాత విజయానందంలో ఉండటం.. కొద్దిరోజుల పాటు మిగిలిన పనుల్లో బిజీగా ఉండటమో లేదంటే.. ఊపిరి సలపని పని ఒత్తిడిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన నేపథ్యంలో కాస్తంత విశ్రాంతి తీసుకోవటం లాంటివి చేస్తుంటారు.

కానీ.. మంత్రి కేటీఆర్ అలాంటి వాటికి కాస్త దూరం. పట్టు చిక్కినప్పుడే మరింత పట్టు పెంచుకోవాలన్నట్లుగా ఆయన వ్యవహరిస్తుంటారు. తాజాగా ఆయన మంత్రి తలసానిని వెంట పెట్టుకొని గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పద్మారావు నగర్ లోని హమాలీబస్తీకి వెళ్లిన వారు అక్కడి బస్తీ వాసుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసుకొచ్చారు. తమ అధినేత కేసీఆర్ చెప్పినట్లే.. విజయానికి పొంగిపోకుండా.. గర్వం తలకెక్కుండా గెలిచిన తర్వాతి రోజే తాము బస్తీల్లో తిరిగి ప్రజాసమస్యలు తెలుసుకుంటున్నామని.. ఇచ్చిన హామీల్ని కచ్ఛితంగా నిలబెట్టుకుంటామని చెప్పుకొచ్చారు. నాన్న మాటను కొడుకు టైమింగ్ చూసుకొని మరీ ప్రయోగిస్తున్నట్లున్నాడు కదూ.
Tags:    

Similar News