రివర్స్ స్టోరీ వీడియో... భర్తను నగ్నంగా కట్టేసిన భార్య చేష్టలు వైరల్!

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తర ప్రదేశ్ లోని బిజ్ఞోర్ కు చెందిన మెహర్ జాహన్‌, మహాన్‌ జైదీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Update: 2024-05-08 02:45 GMT

మహిళలు గృహహింసకు గురవ్వడానికి సంబంధించిన విషయాలు అక్కడక్కడా దర్శనమిస్తూ ఉంటాయనేది తెలిసిన విషయమే. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంచలన విషయం మాత్రం దానికి పూర్తి రివర్స్ అనే చెప్పాలి. ఓ భార్య తన భర్తను మంచానికి కట్టేసి చిత్రహింసలు పెట్టింది. సిగరెట్‌ తో కాల్చింది. మర్మాంగాన్ని కత్తితో కోసేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అవును.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య దారుణ పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో చాలా మంది ఊహించని ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఆ మహిళ తన భర్తను చిత్ర హింసలకు గురిచేసింది. ఎవరూ ఊహించని రీతిలో అన్నట్లుగా చెలరేగిపోయింది. తన భార్తను మంచానికి కట్టేసింది.. సిగరెట్ వెలిగించి కాల్చింది.. మర్మాంగాలను కత్తితో కోసేందుకు ప్రయత్నించింది.. ప్రత్యక్ష నరకం చూపించింది!

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తర ప్రదేశ్ లోని బిజ్ఞోర్ కు చెందిన మెహర్ జాహన్‌, మహాన్‌ జైదీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ప్రెమించుకున్నంత కాలం బాగానే ఉన్న ఆమె... పెళ్లైన తర్వాత మాత్రం వెర్షన్ మార్చింది! తన భర్తను బెడ్ రూమ్ లో చిత్రహింసలకు గురిచేసేది! భార్య పెడుతున్న చిత్రహింసలు తట్టుకోలేక భర్త బెడ్ రూమ్ లో సీసీటీవీలు కూడా అమర్చాడు. దీంతో... ఆమె వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది.

పెళ్లైన కొన్ని నెలలకు ఆమె మరో వ్యక్తితో వివాహేతర బంధం నడిపిస్తోందని.. ఈ వ్యవహారంపై భర్త నిలదీయడంతో అతనిపైనే దాడి చేయడం మొదలుపెట్టిందని తెలుస్తుంది. ఈ క్రమంలో... తనను తరచూ కొట్టడం, సిగరేట్లతో కాల్చడం చేస్తుండేదని చెబుతూ... భార్య వేధింపులు భరించలేక మహాన్ జైదీ పోలీసులను ఆశ్రయించాడు. అయితే... తొలుత వాళ్లు నమ్మలేదని కథనాలొస్తున్నాయి! దీంతో అతడు తన బెడ్‌ రూంలో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టాడట!

Read more!

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో... భర్తకు పాలల్లో మత్తు మందు కలిపి ఇచ్చి అతడి కాళ్లు, చేతుల్ని కట్టేసిందట మెహర్ జాహన్! అనంతరం సిగరెట్ వెలిగించి చేతులు, కాళ్లు, ఒంటిపై వాతలు పెట్టింది! ఈ క్రమంలోనే కత్తి తీసుకొచ్చి మర్మాంగాన్ని కట్‌ చేసేందుకు ప్రయత్నించిందని తెలుస్తుంది! దీంతో పోలీసులను తీసుకొచ్చి ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజీ చూపించాడు మహాన్ జైదీ. దీంతో... షాక్ అయిన పోలీసులు మెహర్ జాహన్‌ ని అరెస్ట్ చేశారు!

Tags:    

Similar News