మోడీ మీద ఫస్ట్ టైం జగన్ అలా !

ఇక రైల్వే జోన్ కి ఏపీ ప్రభుత్వం భూములు ఇవ్వలేదు అన్న మోడీ ఆరోపణలను జగన్ తిప్పికొట్టారు.

Update: 2024-05-07 17:38 GMT

దేశ ప్రధాని నరేంద్ర మోడీ పేరుని జగన్ ఎపుడూ డైరెక్ట్ గా ప్రస్తావించి విమర్శలు చేయలేదు. ఆయన 2014 నుంచి 2019 దాకా అయిదేళ్ల పాటు విపక్షంలో ఉండేవారు. ఆనాడు ఆయన ప్రత్యేక హోదా సాధన అని ఉద్యమాలు చేశారు. అయితే ఆనాడు హోదా విషయంలో చంద్రబాబు ప్రభుత్వాన్నే టార్గెట్ చేశారు తప్ప కేంద్రంలో మోడీని విమర్శించలేదు. ఒకవేళ ఒకటీ అరా విమర్శలు చేసినా ఢిల్లీలో వాళ్ళు అంటూ వచ్చారు తప్ప మోడీ పేరు నోట ఎత్తేవారు కాదన్న విమర్శలు ఉన్నాయి.

అయితే ఇన్నాళ్ళకు జగన్ మోడీ పేరుని డైరెక్ట్ గా ఎత్తి విమర్శలు చేశారు. ఆయన దానికి గాజువాక ఎన్నికల సభను వేదికగా చేసుకున్నారు. ఆయన గాజువాకలో మాట్లాడుతూ మోడీ మార్క్ రాజకీయాలు ఇవేనా అని దుయ్యబెట్టారు. అయిదేళ్ల క్రితం 2019లో చంద్రబాబుని అత్యంత అవినీతి పరుడు అని విమర్శించిన మోడీ పోలవరం ఏటీఎం గా చంద్రబాబు వాడుకున్నారు అన్న మోడీ ఇపుడు బాబుని గొప్ప పాలనాదక్షుడిగా కీర్తించడమేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీలు మారుస్తూ రాజకీయాలు చేస్తూ వెన్నుపోట్లలో బాబు నిపుణుడు అని ఆనాడు ఇదే మోడీ విమర్శించారు అని గుర్తు చేశారు. కానీ ఇపుడు మాత్రం బాబు ఈజ్ గ్రేట్ అంటున్నారు అని మండిపడ్డారు. ఈ మాటలు వింటూంటే రాజకీయాలు ఎంతలా దిగజారిపోయాయో ఆలోచన చేయాలని ఆయన అన్నారు. తమకు దూరంగా ఉంటే విమర్శలు చేస్తారు ఆరోపణలు చేస్తారు తమ పక్కకు వస్తే మాత్రం గొప్పగా కీర్తిస్తారు ఇదేనా రాజకీయం అని మోడీని నిలదీశారు.

Read more!

ఇక రైల్వే జోన్ కి ఏపీ ప్రభుత్వం భూములు ఇవ్వలేదు అన్న మోడీ ఆరోపణలను జగన్ తిప్పికొట్టారు. ఏపీ ప్రభుత్వం భూములను ఏనాడో ఇచ్చిందని అయితే వాటిని కేంద్రమే తీసుకోలేదని ఆయన సరికొత్త ఆరోపణలు చేశారు. ఏపీకి 2014 నుంచి 2019 దాకా మోడీ బాబు పవన్ కూటమి చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు.

ఇపుడు మళ్ళీ ఈ ముగ్గురూ కలసి కొత్త డ్రామా మొదలెట్టారని జగన్ ఫైర్ అయ్యారు. ఈ ముగ్గురూ కలిశారు బాగానే ఉంది కానీ వీరు ఏపీకి ఇచ్చే హామీ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తానికి మోడీ పేరు ఎత్తి జగన్ చేసిన విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి. ఆయన మోడీ మీద నేరుగా విమర్శలు చేయడం వెనక వ్యూహాలు ఏమిటి అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.

మరో వైపు చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా జగన్ అసలు విషయం చెప్పారు. తాను ఏపీలో అధికారంలో ఉండబట్టే స్టీల్ ప్లాంట్ ని కేంద్రం ప్రైవేటీకరించకుండా ఉందని, దానిని తానే ఆపాను అని ఆయన చెప్పుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలీ అంటే వైసీపీనే గెలిపించాలని టీడీపీ కూటమిని ఓడించాలని ఆయన డిమాండ్ చేశారు. మరి దీని మీద జనాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News