పవన్ కి కీలక మంత్రిత్వ శాఖ రెడీ ?

టాలీవుడ్ కోటి ఆశలు పెట్టుకుంది కాబట్టి అటు సినీ రంగానికి ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా పవన్ నే ఉంచుతూ ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారని అయితే ప్రచారం తాజాగా సాగుతోంది.

Update: 2024-05-07 17:38 GMT

టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వస్తుందని ఎన్డీయే కూటమి పెద్దన్న నరేంద్ర మోడీ అమిత్ షా చెప్పేశారు. ఇక సర్వేలు చూస్తే కూటమికి అనుకూలంగా వస్తున్నాయి. దాంతో టీడీపీ కూటమి గెలిస్తే ఏమిటి జరుగుతుంది అన్న చర్చ అయితే ఏపీలో సాగుతోంది.

టీడీపీ కూటమి గెలిస్తే కచ్చితంగా చంద్రబాబు సీఎం అవుతారు అని అంటున్నారు. అందులో రెండవ ఆలోచన లేదు. డౌట్ అంతకంటే లేదు. మోడీ అమిత్ షాలు కూడా బాబే సీఎం అని చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి గెలిచి అసెంబ్లీకి అడుగుపెడతారని జనసేన వర్గాలు ధీమాగా ఉన్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే పవన్ గెలవాలని టోటల్ టాలీవుడ్ మనస్పూర్తిగా కోరుకుంటోంది. టాలీవుడ్ లో చిన్న ఆర్టిస్టుల నుంచి బడా ఆర్టిస్టుల దాకా అంతా పవన్ గెలవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ఇలా ఒక హీరో కోసం అవుట్ రేట్ గా సినీ రంగం ఒక్కటిగా నిలిచి మద్దతు ఇవ్వడం గతంలో ఎపుడూ జరగలేదు అని అంటున్నారు.

ఇదంతా ఎందుకు అంటే ఏపీలో కొత్త ప్రభుత్వం వస్తే సినీ రంగం సమస్యలు కూడా తీరుతాయన్న ఆశలు ఉన్నాయని అంటున్నారు. ఏపీ టాలీవుడ్ కి అతి పెద్ద రెవిన్యూ స్పాట్ గా ఉంది. ఎక్కువ ధియేటర్లు కూడా ఇక్కడే ఉన్నాయి. దాంతో గత అయిదేళ్ళలో రేట్లు అధికంగా పెంచుకునే వెసులుబాటు పూర్తిగా లేక ఇబ్బందులు టాలీవుడ్ ఇబ్బందులు పడిందని అంటున్నారు.

Read more!

ఇక చూస్తే ఈసారి టాలీవుడ్ సపోర్ట్ ఇవ్వడానికి మొదట్లో సందేహించినా పోలింగ్ కి కౌంట్ డౌన్ అయిన వేళ మాత్రం గొంతు విప్పి ఒక్కటిగా కూటమి వెంట నిలిచింది. ఆఖరుకు మెగాస్టార్ చిరంజీవి కూడా కూటమి సైడ్ తీసుకున్నారు. మొత్తం మీద చూస్తే కూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం అయితే టాలీవుడ్ కి బలంగా ఉంది అని అంటున్నారు.

ఇక టీడీపీ గెలిచి పవన్ కూడా ప్రభుత్వంలో చేరితే ఆయన కచ్చితంగా మంత్రి అవుతారు అని అంతా అంటున్నారు. అయితే ఆయనకు ఏ శాఖ ఇస్తారు అన్నది చర్చగా ఉంది. అయితే పవన్ సినీ హీరో కాబట్టి ఆయన మీద టాలీవుడ్ కోటి ఆశలు పెట్టుకుంది కాబట్టి అటు సినీ రంగానికి ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా పవన్ నే ఉంచుతూ ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారని అయితే ప్రచారం తాజాగా సాగుతోంది.

నిజానికి ఈ శాఖ చాలా ప్రాముఖ్యత కలిగిన శాఖ. దాంతో పాటు ఏపీలో సినీ పరిశ్రమకు ఊతమిచ్చేలా కృషి చేసే కీలక బాధ్యత కూడా పవన్ కి ఉండేలా ఈ శాఖను అప్పగిస్తారు అని అంటున్నారు. తొలిసారి అసెంబ్లీకి నెగ్గిన పవన్ కి ఈ శాఖ అప్పగించడం కూడా సముచితం అని అంటున్నారు.

అయితే పవన్ కి హోం మినిస్టర్ ఇవ్వాలని కాపు నేత మాజీ మంత్రి హరి రామజోగయ్య డిమాండ్ చేస్తున్నారు. హోం శాఖ అంటే సీఎం తరువాత ప్లేస్ లో ఉంటుంది. నంబర్ టూ అన్న మాట. మరి ఆ శాఖ పవన్ కి ఇస్తారా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా అనుభవం బట్టి శాఖలు ఇవ్వడంతో దిట్ట అయిన చంద్రబాబుకు ఎవరిని ఎలా వాడుకోవాలో తెలుసు అంటున్నారు.

4

సో పవన్ కూడా తన సొంత రంగం అయిన సినీ రంగానికి సేవ చేయడానికి ప్రజల తరఫున కూడా సినీ పరిశ్రమ ఫలితాలు అందించడానికి సినిమాటోగ్రఫీ శాఖ ఉపకరిస్తుంది అని అంటున్నారు. మొత్తానికి పవన్ కి చంద్రబాబు సముచిత గౌరవరం తమ ప్రభుత్వంలో ఇస్తారని అంటున్నారు.

చాలా మంది ప్రచారం చేస్తున్నట్లుగా పవన్ ని మంత్రి పదవికి దూరంగా పెట్టరు అని అంటున్నారు. ఆయనతోనే టీడీపీ కూటమిని బాబు దగ్గర ఉండి నడుపుతారు అని అంటున్నారు. సో చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News