తనకున్న ఆరోగ్య సమస్యను తొలిసారి షేర్ చేసిన కేటీఆర్

Update: 2022-03-06 09:29 GMT
నిత్యం వార్తల్లో ఉండటమే కాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడిగా.. భవిష్యత్ సీఎంగా అందరూ చెప్పుకునే కేటీఆర్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాలు పెద్దగా రావు. ఆయనకున్న ఆరోగ్య సమస్య గురించిన వివరాలు ఇప్పటివరకు ఏమీ రాలేదు. కానీ.. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన షాకింగ్ నిజాన్ని వెల్లడించారు.

తనకు షుగర్ వ్యాధి ఉందని చెప్పారు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం తాను టెస్టు చేయించుకున్నప్పుడు షుగర్ సమస్య ఉందన్న విషయాన్ని గుర్తించానని.. జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఆయన చెప్పారు. దీంతో.. అక్కడున్న వారంతా ఒక్కసారి విస్మయానికి గురయ్యారు. చూసేందుకు ఫిట్ గా ఉండి.. తరగని ఉత్సాహంతో కనిపిస్తుంటారు.

అలాంటి మంత్రి కేటీఆర్ తనకున్న ఆరోగ్య సమస్యను బయటకు వెల్లడించటం ద్వారా.. ఆయన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే అవకాశం కలిగింది. ఆ విషయాల్లోకి వెళితే.. తండ్రికి.. కొడుక్కి మధ్యనున్న వ్యత్యాసాల గురించి చాలామందికి తెలీదు కూడా. దైవభక్తి అమితంగా ఉండే కేసీఆర్ కు భిన్నంగా కేటీఆర్ కు దేవుడు లాంటి వాటిని అస్సలు పట్టించుకోరు.

 ఆ మాటకు వస్తే.. దేవాలయానికి సైతం చాలా చాలా అరుదుగా వెళుతుంటారని చెబుతారు. ఇంట్లో జరిగే పూజలు..యాగాల్లోనూ ఆయన పాల్గొనరు. ఒకవేళ పాల్గొన్నా.. ఎంతవరకు ఉండాలో అంత వరకే ఉంటారని చెబుతారు. అయితే.. తన ఇష్టాయిష్టాల్ని ఇంట్లో వాళ్ల మీద రద్దుటం లాంటి చెత్త పనులు చేయరన్న విషయం తెలీదు కూడా.

అంతేనా..ఆయనకు తండ్రి అంటే అమితమైన భక్తి.. అంతకు మించి భయం కూడా. ఇప్పటికి.. రాష్ట్రానికి డిప్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్న కేటీఆర్.. తండ్రి కేసీఆర్ ముందు కూర్చునే సాహసం కూడా చేయరని చెబుతారు. తండ్రి నోటి నుంచి ఏదైనా మాట వస్తే.. దాని గురించి కాదనటం లాంటివి అస్సలు చేయరని చెబుతారు.

అంతేనా.. ఆయన తీసుకునే ఆహారం చాలా చాలా తక్కువగా ఉంటుందని చెబుతారు. రోజువారీగా ఆయన తీసుకునే ఆహారం చాలా లిమిటెడ్ గా ఉంటుందని.. మధ్యాహ్నం భోజన వేళలోనూ అతి తక్కువ క్యాలరీ ఫుడ్ ను మాత్రమే తీసుకుంటారని చెబుతారు. రోజుకో యాపిల్ మాత్రం కచ్ఛితంగా తీసుకునే అలవాటు ఉందంటారు.

ఆరోగ్య నియమాలు.. వ్యాయామంతో పాటు.. తీసుకునే ఆహారం విషయంలోనూ ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారని చెబుతారు. సమయానికి భోజనం చేయటం సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవటంతో ఆయన చాలా సందర్భాల్లో కారులోనే అల్పాహారాన్ని లాగించేస్తారని చెబుతారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆయన షుగర్ పడగ నీడ తన మీద పడకుండా చూసుకోలేకపోయారు.

అందుకే.. మిగిలిన వారైనా సరే.. వయసుతో సంబంధం లేకుండా షుగర్ టెస్టు చేయించుకొని.. అందుకు తగ్గట్లు మెడిసిన్స్ వాడటం ద్వారా.. ఇబ్బందులను అధిగమించే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల టూర్ లో ఈ షాకింగ్ నిజాన్ని వెల్లడించారు. తనకు పదహారేళ్ల క్రితమే షుగర్ ఉందన్న విషయాన్ని గుర్తించి.. అందుకు తగ్గట్లు వైద్యాన్ని చేయించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయనకు షుగర్ ఉండొచచ్చేమో కానీ.. ఆరోగ్య సమస్యలు ఎదురుకాకుండా ఉండాలని ఆశిద్దాం.
Tags:    

Similar News