కేటీఆర్ న్యూఇయర్ రిజల్యూషన్ ఇదే!
సంప్రదాయ రాజకీయాలతో పాటు.. డిజిటల్ రాజకీయాల్ని ఒకే సమయంలో చేసే సత్తా ఉన్న నేతగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ను చెప్పాలి. తన తండ్రిలోని వాక్ చాతుర్యాన్ని.. సమర్థతతను అందిపుచ్చుకున్న కేటీఆర్.. తన తండ్రిలో లేని మరికొన్ని క్వాలిటీస్ ను పుణికి పుచ్చుకున్నారని చెప్పాలి.
అందరితో కలుపుగోలుగా ఉండటం కేసీఆర్ లో కనిపించదు. తనదైన లోకంలో ఆయన ఉంటారు. నలుగురిలో భిన్నంగా ఉండాలన్న వైఖరి కేసీఆర్‌లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ.. కేటీఆర్ లో అలాంటివి అస్సలు కనిపించదు. నలుగురితో చటుక్కున కలిసిపోవటమే కాదు.. ఏ గ్రూపులో ఉంటే అందుకు తగినట్లుగా మారిపోయే స్వభావం కేటీఆర్ లో కనిపిస్తుంది.
నేతలతో ఉన్నప్పుడు రాజకీయ నేతగా ఉండే ఆయన.. సినీ ప్రముఖులతో కలిసినప్పుడు తాను మంత్రినన్న భావన రానివ్వకుండా వారిలో ఒకడిగా ఆయన కలిసిపోతుంటారు. పవర్ చేతికి వచ్చిన ఏడాదిన్నరలోనే అన్ని వర్గాలపైనా పట్టు సాధించిన కేటీఆర్.. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉండటం తెలిసిందే.
తాజాగా న్యూ ఇయర్ రిజల్యూషన్ మీద ఒక ఆసక్తికర పోస్ట్ ను ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. తానుకొత్త ఏడాది రోజుకు ఐదు కిలోమీటర్లు వాకింగ్ చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నానని.. అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధిస్తానని చెప్పారు. రోజుకు 5 కిలోమీటర్లు నడవటమే లక్ష్యమైతే.. అందుకు జనవరి 1 వరకు ఆగటం ఎందుకు.. రేపటి నుంచే మొదలు పెడితే.. న్యూఇయర్ నాటికి ఐదారు రోజుల అనుభవం కూడా వచ్చేస్తుందని చెప్పొచ్చు. చాలామంది మాదిరి కొత్త సంవత్సరం లక్ష్యాన్ని ప్రకటించిన మంత్రి కేటీఆర్.. పొద్దున్నే 5 కిలోమీటర్ల వాకింగ్ తో పరిపెట్టుకుంటారా? మరికొన్ని రిజల్యూషన్స్ ను తెర మీదకు తెస్తారో చూడాలి.