గూడ అంజయ్య గుర్తుకు రాలేదేం కేటీఆర్..?
రాజకీయ వారసత్వంలో భాగంగా అధికారాన్ని పంచుకోవటం మామూలే. కానీ.. ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూ.. వస్తుందో రాదో తెలీని అంశంపై పోరాటం చేయటం చిన్న విషయం కాదు. తన స్వప్నం సాకారమయ్యే ఛాన్సే లేదని తండ్రి సైతం అనుకునే అంశంలో (లోగుట్టుగా).. తండ్రి వెంటే నడావలని విదేశాల్లో చేసే ఉద్యోగాన్ని వదిలేసి మరీ వచ్చి.. ఈ రోజు అందరి మన్ననలు అందుకోవటం అంత తేలికైన అంశం కాదు. అప్పటికే పాతుకున్న తన బావకు మించిన నేతగా.. కేసీఆర్ కు అసలుసిసలు వారసుడిగా మారటం అంత తేలికైన వ్యవహారం కాదు. కానీ.. అలాంటివన్నీ చాలా సులువుగా అన్నట్లుగా సాధ్యమయ్యేలా చేసుకోవటం కేటీఆర్ కు మాత్రమే చెల్లుతుంది.
తన రాజకీయ ప్రస్థానాన్ని ఉద్యమంతో షురూ చేసిన కేటీఆర్ లాంటి వ్యక్తికి గూడ అంజయ్య లాంటి ప్రజాకవి తెలీదనుకోవటం ద్రోహమే అవుతుంది. ఉద్యమ స్ఫూర్తిగా నిలిచే పాటలు పాడనప్పటికీ.. ఆ పాటను ఉద్యమానికి ఉత్పేరకంగా ఎలా వినియోగించుకోవాలో కేసీఆర్ కు ఎంత బాగా తెలుసో.. అంతే బాగా కేటీఆర్ కు తెలుసు. అయ్యోనివా.. నువ్వు అవ్వోనివా.. తెలంగాణోనికి తోటి పాలోనివా? అంటూ ప్రశ్నిస్తూ.. ఈ ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా.. ఈ నేతల మనదిరా.. అంటూనే ఎవడబ్బ సొమ్మురా? అంటూ నిలదీయటమేకాదు.. దొర ఏందిరో.. వాడి పీకుడేందిరో అంటూ మంట పుట్టేలా పాట రాయగల అసలుసిసలు తెలంగాణ ఉద్యమకారుడైన గూడ అంజయ్య చేసిన సేవలు.. తెలంగాణ సాధనలో అతడి పాట తమకెంత సాయం చేశాయన్న విషయాన్ని కేటీఆర్ కు ఎవరో వివరించి చెప్పాల్సిన అవసరమే లేదు.
మరి.. అంతలా సాయపడిన పాట రాసిన వ్యక్తి తిరిగి రాని లోకాలకువెళ్లినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కావొచ్చు.. ఆయన రాజకీయ వారసుడు కేటీఆర్ కానీ ఎందుకు కనిపించలేదు. తన పాటతో కోట్లాది గుండెల్లో కసెక్కేలా చేసిన గుండె పని చేయటం ఆగిపోయి.. అచేతనంగా మారిన అంజయ్యను చూసేందుకు.. టీఆర్ఎస్ అధినేత పుత్రరత్నానికి తీరిక లేకపోవటం ఏమిటి?
ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా జరిగితే.. తెలంగాణ వారు కావటమే ఇలాంటి అవమానం జరుగుతుందంటూ గొంతులు చించుకునే గులాబీ దళం.. గూడ అంజయ్యను కోల్పోయిన వేళ ఎందుకు కదల్లేదు. తెలంగాణ సమాజానికి ఆయన చేసిన సేవలకు గురుతుగా ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ఎవరో ఒకరు ఆయన కుటుంబాన్ని పరామర్శించటానికి ఎందుకు వెళ్లలేదు? తీరిక లేకపోవటమా? లేదంటే.. తీరుబడి చేసుకునేంత పెద్ద మనిషి కాదనుకున్నారా? తాజాగా తెలంగాణ ఉద్యమానికి పునాది అయిన పుస్తకాల్లో ఒకటిగా చెప్పుకునే తెలంగాణ సర్ ప్లస్.. ఏ కేస్ స్టడీ అంటూ ప్రపంచానికి తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి తెలిసేలా పుస్తకం రాసిన ప్రముఖ ఆర్థిక వేత్త బీపీ విఠల్ ను మంత్రి కేటీఆర్ కలవటం.. ఆయనతో దాదాపు గంట పాటు ముచ్చటించటం చూసినప్పుడు చప్పున గూడ అంజయ్య గుర్తుకు రాక మానదు. ఇదే కేటీఆర్ కు ఆయన ఎందుకు గుర్తుకు రానట్లు? అన్న ప్రశ్న మనసులో మెదలక మానదు. దీనికి సమాధానం చెప్పే వారు ఎవరు..?