పార్టీ టికెట్లపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. పీకే సర్వేనే కీలకం

Update: 2022-06-12 05:30 GMT
షెడ్యూల్ ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర టైం ఉంది. అయినప్పటికీ.. ఆ పార్టీలో అందరూ ముందస్తు ఎన్నికల మీద మాట్లాడుకునే పరిస్థితి. మరోవైపు టీఆర్ఎస్ కు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను ఎంపిక చేయటం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అరడజనకు పైగా సర్వేలు.. ప్రజల్లో గులాబీ బాస్ కున్న పలుకుబడి.. ఆయన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు ఎలా రియాక్టు అవుతున్నారన్న అంశంపై భారీ సర్వేలు నిర్వహించారు.

ఇదిలా ఉంటే..వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు వీలుగా ఇప్పటికే కసర్తతు చేస్తున్న పీకే టీం.. మరో అడుగు ముందుకు వేసి.. షెడ్యూల్ కంటే ముందుగా ఎన్నికలు జరిగిన పక్షంలో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసే విషయంలో తలమునకలై ఉన్నట్లుగా చెబుతున్నారు ఇదిలా ఉండగా.. తాజాగా తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇందులో పేర్కొనే అంశాలకు ఆధారంగానే టికెట్లు దక్కుతాయని కీలక వ్యాఖ్య చేశారు మంత్రి కేటీఆర్.

తాజాగా ఆయన ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టికెట్ల అంశం చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'ప్రశాంత్ కిశోర్ నియోజక వర్గాల వారీగా సర్వేలు చేస్తున్నారు. ఆ నివేదికల ఆధారంగానే టికెట్లు దక్కుతాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అవసరమైన చోట కొన్ని మార్పులు ఉంటాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం. టికెట్లు రాని వారిని పార్టీ వదులుకోదు. విభేదాల్ని పక్కన పెట్టి సఖ్యతతో పని చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని 10కి 10 సీట్లు వచ్చేలా పని చేయాలి' అంటూ దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు.

మంత్రి కేటీఆర్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పీకే పెద్ద ఎత్తున సర్వే చేస్తున్నారన్న విషయాన్ని కన్ఫర్మ్ చేయటంతో పాటు.. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చన్న క్లియర్ సంకేతాన్ని తెలియజేయటం ద్వారా.. త్వరలోనే మరోసారి ఎన్నికలు తప్పవన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ముందస్తు ఎన్నికలు ఖాయమన్న మాట జోరుగా ప్రచారం సాగుతున్న వేళ.. తాజాగా కేటీఆర్ నోటి నుంచే స్వయంగా రావటం హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News