సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చేసిన కేటీఆర్

Update: 2020-12-07 05:30 GMT
టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కమ్ మంత్రి అయిన కేటీఆర్ నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిద్ర పట్టనట్లుగా మారాయని చెబుతున్నారు.  తాజాగా వెల్లడైన గ్రేటర్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ కు భారీ షాక్ తగలటం తెలిసిందే. 99 డివిజన్ల బలం కాస్తా 55 డివిజన్లకు తగ్గిపోవటం.. నాలుగు డివిజన్లలో బలం ఉన్న బీజేపీ ఏకంగా 48 డివిజన్లకు చేరుకోవటం అధికారపార్టీని అలెర్టు అయ్యేలా చేసింది. అదే సమయంలో.. తప్పులు ఎక్కడ జరిగాయన్న ఆత్మవిమర్శ మొదలైంది.

దీనికి తగ్గట్లే తాజాగా కేటీఆర్ నోటి నుంచి మాటలు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లతో భేటీ అయిన సందర్భంగా కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సిట్టింగులకు అవకాశం ఇచ్చిన చోట ఎక్కువ స్థానాల్లో ఓడిపోయామని.. సిట్టింగుల్ని మార్చిన చోట ఫలితాలు మెరుగ్గా వచ్చాయని చెప్పిన కేటీఆర్.. సిట్టింగుల విషయంలో తాజా ఎన్నిక హెచ్చరిక లాంటిదన్న మాట ఆయన నోటి నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.

ఫలితాలతో నిరాశ చెందొద్దని చెబుతూనే.. గుణపాఠంగా తీసుకోవాలన్న మాట కేటీఆర్ నోటి నుంచి రావటం.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశం ఉందన్న మాట ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టేలా మరింది. సిట్టింగుల్ని మార్చిన చోట గెలిచాం.. మార్చని చోట ఓడామని చెప్పిన ఆయన.. లోపాల్ని సరిదిద్దుకొని ముందుకు సాగాలన్న మాటల మధ్యనున్న అధినాయకత్వం ఆలోచన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాకింగ్ మారిందంటున్నారు. 2018లో మాదిరి కాకుండా.. సిట్టింగుల్లో ప్రజా వ్యతిరేకత ఉన్న వారిని పక్కన పెట్టటం మినహా మరో మార్గం లేదన్న భావనకు అధినాయకత్వం వచ్చిందని.. అందులో భాగంగానే కేటీఆర్ నోట అలాంటి మాటలు వచ్చినట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే..సిట్టింగ్ ఎమ్మెల్యేలకు భవిష్యత్తు మీద బెంగ ఇప్పటినుంచే షురూ అవుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News