కేటీఆర్ కే షాకిస్తున్నారే.?

Update: 2019-08-16 05:40 GMT
ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ కొట్టాలో తెలిసిన వాడు మగాడ్రా బుజ్జీ అంటాడు తనికెళ్ల భరిణి.. ఆ డైలాగును కొంచెం మార్చి బీజేపీకి ఇప్పుడు అప్లయ్ చేయవచ్చు. బలం, బలగం.. క్యాడర్ పరంగా.. నాయకుల సపోర్టుగా పరంగా అధికార టీఆర్ ఎస్ కు ఇప్పుడు తెలంగాణలో తిరుగులేదు.  టీఆర్ ఎస్ ను కొట్టే అస్త్రమేదీ ప్రతిపక్షాలకు లేదు.. కానీ ఈ బీజేపీకి మాత్రం పెద్ద అస్త్రాలే ఉన్నాయి. ఇప్పుడు దాన్నే పట్టుకొని గులాబీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

అది కేటీఆర్ సొంత నియోజకవర్గం ‘సిరిసిల్ల’. చేనేతన్నలు లక్షల మంది ఉన్న ఈ నియోజకవర్గంలో వారి కుల దైవం ‘మార్కండేయ స్వామి’ శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. నిన్న రాత్రి ఈ వేడుకను టీఆర్ ఎస్ శ్రేణులు నేతన్నల ఫ్యామిలీలతో కలిసి ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేశారు. చేనేతన్నలు వేల మంది రోడ్ల మీదకు వచ్చి శోభయాత్ర నిర్వహించారు.

కానీ సడన్ గా వచ్చేశాడు బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. హిందుత్వ యాత్రలా దాన్ని మార్చేశారు. కాషాయ జెండాలు, టోపీలు పంచేసి స్వయంగా మార్కండేయ స్వామి రథంపై కూర్చొని నేతన్నల మగ్గం నేస్తూ వారితో కలిసిపోతూ మొత్తం యాత్రను టీఆర్ ఎస్ శ్రేణుల నుంచి హైజాక్ చేసి బీజేపీ హిందుత్వ యాత్రలా మార్చేశారట..

సొంత నియోజకవర్గంలో తనకు ఓట్లేసిన చేనేతన్నల పండుగకు కేటీఆర్ హాజరు కాక విమర్శలు ఎదుర్కోగా.. ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ ఈ వేడుక కోసమే ప్రత్యేకంగా కేటీఆర్ సొంత ఇలాకాకు వచ్చి ఈ పండుగను బీజేపీ పండుగగా మార్చేశాడు. దీంతో అవాక్కవ్వడం టీఆర్ ఎస్ శ్రేణుల వంతైందట.. ఇలా కేటీఆర్ ఇలాకాలోనే హిందుత్వ వాదులను ఆకర్షిస్తూ తిరుగులేని ఈ అస్త్రంతో కేటీఆర్ ప్రేమికులను బీజేపీ ఎంపీ బండిసంజయ్ తనకు అనుకూలంగా మార్చేసుకున్న తీరు ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

 



Tags:    

Similar News