వాడుకోవడంలో కేటీఆర్ తోపు ..ఇదే ఎగ్జాంపుల్
తండ్రి రాజకీయ చాణక్యాన్ని అందిపుచ్చుకునేందుకు తనదైన శైలిలో కృషిచేస్తున్న టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ - మంత్రి కేటీఆర్ ఈ క్రమంలో సఫలీకృతుడు అవుతున్నట్లే కనిపిస్తోంది. ఆయా సందర్భాలను తనకు అనుకూలంగా మల్చుకోవడంలో ఆరితేరిన కేటీఆర్...తాజాగా సంక్రాంతి పండగను ఈ కోణంలోనే ఉపయోగించుకున్నారని చర్చ జరుగుతోంది.టీఆర్ ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. ఈ సంబురాల్లోనూ కేటీఆర్ ఓట్లు అడిగారు!
సంక్రాంతి పండుగ నేపథ్యంలో టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయా ఆవరణంలె అందమైన రంగవల్లులు వేశారు. రంగురంగుల పతంగులతో కార్యాలయాన్ని ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌కు విచ్చేశారు. పార్టీ కార్యాలయంపై పతంగులు ఎగురవేశారు. ఈ సందర్భంలో మంత్రి ఉత్సాహంగా గడిపారు. అయితే, ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే...ఆ పతంగులపై ముద్రించిన చిత్రాలే.! ఓట్ ఫర్ కార్ అంటూ కేటీఆర్ ఎగురవేసిన పతంగుల్లో బొమ్మలు నినాదాలు ఉన్నాయి. దీంతో, పండుగను సైతం ప్రచారం కోసం వాడుకున్నారుగా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు ట్విట్టర్లోనూ తన ప్రచార పంథాను కేటీఆర్ కొనసాగించారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మరో ట్విస్టిచ్చారు. సంక్రాంతి ముగ్గుల ద్వారా టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నందుకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు!