చంద్రబాబును ఢిల్లీలోనూ రఫ్పాడించేశారు

Update: 2015-06-27 09:54 GMT
    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల తెలుగు ప్రజల కోసం పనిచేయడం లేదని... 5 కోట్ల ఓటుకు నోటు కేసు నుంచి బయటపడడానికి  పనిచేస్తున్నారని మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని తాము కోరుకుంటుంటే చంద్రబాబు రెండిటి మధ్య చిచ్చు రగిలించడానికి ప్లాన్ చేస్తున్నారంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

చంద్రబాబు తప్ప చేసి కూడా ఆ తప్పును రాష్ట్ర సమస్యగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని.... ఈ వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఇది వారి సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొన్న ఈ సిగ్గుమాలిన పనితో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చేశారు.

అంతేకాదు... హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని.. ఎలాంటి గొడవలూ లేవని.. సెక్షన్ 8 అవసరం లేదని కేటీఆర్ చెప్పొకొచ్చారు. మొత్తానికి కేటీఆర్ చంద్రబాబును ఇక్కడ తిట్టింది చాలదన్నట్లుగా ఢిల్లీ వెళ్లి మరీ మరో రౌండ్ వేసుకున్నారు.
Tags:    

Similar News