కేటీఆర్ చేత కర్చీఫ్ లు వేయించుకుంటున్నారా?
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వ్యవహారంతో రాజకీయం ఇప్పుడు మరింత ఉత్సాహంగా మారింది. విపక్షాల బలం పెద్దగా లేకపోవటం.. ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ దే హవా అన్న మాట ప్రతిచోట వినిపిస్తోంది. స్థానికంగా ఉండే ప్రతికూలతలు ఏమైనా కొందరు అభ్యర్థుల విషయంలో ఉండొచ్చేమో కానీ.. మొత్తంగా చూస్తే.. మున్సిపాల్టీల్లోనూ.. కార్పొరేషన్లలోనూ గులాబీ కారుకు తిరుగు ఉండదని చెబుతున్నారు.
దీంతో.. టీఆర్ఎస్ టికెట్లకు పోటీ భారీగా పెరిగింది. అయితే.. మున్సిపాల్టీలు కానీ..కార్పొరేషన్లు కానీ టికెట్లను ఇచ్చే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలకు అప్పజెప్పేసి అనవసరమైన తలనొప్పులకు దూరంగా ఉంది. ఇదిలా ఉంటే.. కార్పొరేషన్లకు సంబంధించిన సరికొత్త రాజకీయం తాజాగా షురూ అయిందన్న మాట వినిపిస్తోంది.
కార్పొరేషన్లకు ఖరారైన రిజర్వేషన్ల ఆధారంగా కొత్త సమీకరణాలు తెర మీదకు రావటం.. మేయర్ పదవిని సొంతం చేసుకోవటం కోసం కొందరు ఆశావాహులు తెర మీదకు వస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరు నేరుగా మంత్రి కేటీఆర్ ను కాంటాక్ట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ నగర శివారులోని ఏడు కార్పొరేషన్ల మేయర్ పదవుల కోసం భారీ డిమాండ్ నెలకొంది.
శివారులో భూమల ధరలు భారీగా ఉండటం.. మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంటే.. తమకు తిరుగు ఉండదన్న ఉద్దేశంతో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పుడు తెర మీదకు వస్తున్నారు. వీరంతా ఎంత ఖర్చుకైనా వెనకాడేది లేదని చెబుతూ.. మేయర్ పీఠం తమకు వచ్చేలా చేసుకోవటం కోసం పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇలాంటి వారికి కౌంటర్ ఇచ్చేందుకు మరో వర్గం.. ముందస్తుగా మంత్రి కేటీఆర్ ను కలిసి.. ఫలానా మేయర్ పదవి తమకు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు షురూ చేస్తున్నారని.. ఆయన నోటి వెంట సర్లే.. చూద్దామన్న మాట కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. కేటీఆర్ నోటి నుంచి అలాగే అన్న మాట మేయర్ కుర్చీ మీద కర్చీప్ వేసినట్లే అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం ఆసక్తికరంగా మారింది.