​తెలంగాణకు టాటా షేక్ హ్యాండ్

Update: 2015-07-23 11:04 GMT
దేశంలో ప్రముఖ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్‌ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ కొద్దిసేపటి కిందట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి కొహ్లి పరిశోధన శంకుస్థాపన లో పాల్గొన్న అనంతరం ఆయన ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో కొహ్లి పరిశోధన కేంద్రానికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తో కలిసి మిస్త్రీ శంకుస్థాపన చేశారు. ఆ తరువాత కేసీఆర్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలు, రాయితీలు వంటివి వారి మధ్య చర్చకొచ్చినట్లు సమాచారం.

    కాగా  సైరస్‌ మిస్ర్తీ సుమారు ఏడాది కిందట కూడా కేసీఆర్ తో సమావేశమయ్యారు. 2014 ఆగస్టు మొదటివారంలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ లను కలిశారు. రెండు రాష్ట్రాల అభివృద్ధిలో టాటాలు భాగస్వామ్యం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు మిస్ర్తీ అప్పట్లో ప్రకటించారు. చంద్రబాబు దార్శనికతను ప్రశంసించిన మిస్ర్తీ, కెసిఆర్‌ రూపొందించిన కొత్త పారిశ్రామిక విధానం ముసాయిదాను కొనియాడారు. రెండు రాష్ట్రాలతో తమ గ్రూప్‌ అనుభవాన్ని, జ్ఞానాన్ని పంచుకుంటుందని నిరుడు హామీ ఇచ్చారు. స్మార్ట్‌ సిటీల నిర్మాణంలో పాలుపంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దీనికి కావాల్సిన సాంకేతిక సామర్ధ్యం తమ వద్ద ఉందని మిస్త్రీ చెప్పారు. తెలంగాణలో తక్కువ ఖర్చుతో సోలార్ యూనిట్ల స్థాపన ఆలోచన చేస్తున్నట్లు నిరుడే చెప్పారు. హైదరాబాదు నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా మార్చే కార్యక్రమంలోనూ భాగస్వాములయ్యేందుకు ఆసక్తి చూపారు. తాజా భేటీలో ఆయన ఈ అంశాలన్నిటిపై మరింత విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.ర్చాలనే యోచన చాలా మంచిదన్నారు.
Tags:    

Similar News